ePaper
Tuesday, September 22, 2026
📄 ePaper
Homeఎడిటోరియల్కార్తికేయన్ మృతదేహానికి నివాళులు అర్పించిన ఎమ్మెల్యే ఆదిమూలం

కార్తికేయన్ మృతదేహానికి నివాళులు అర్పించిన ఎమ్మెల్యే ఆదిమూలం

📰 Generate e-Paper Clip

• భాదిత కుటుంబానికి ఆర్ధిక సాయం అందజేత

సురుటపల్లి పంచాయతీ కస్తూరి నాయుడు కండ్రిగ గ్రామానికి చెందిన రవి,జయ దంపతుల కుమారుడు తొమ్మిదవ తరగతి విద్యార్థి కార్తికేయన్ గతవారం రోజులుగా తీవ్ర జ్వరంతో బాధపడుతూ తమిళనాడు రాష్ట్రం చెన్నై స్టాన్లీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శుక్రవారం అర్ధరాత్రి మృతి చెందాడు. ఈ నేపథ్యంలో విషయం తెలుసుకున్న సత్యవేడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం శనివారం ఉదయం కస్తూరినాయుడు కండ్రిగ గ్రామానికి చేరుకుని కార్తికేయన్ మృతదేహాన్ని సందర్శించి నివాళులర్పించారు. అలాగే మృతుని కుటుంబానికి ఆర్థిక సాయం అందజేశారు. సంఘటనా స్థలంలోనే వైద్యాధికారులను, పంచాయతీ కార్యదర్శులును పిలిపించి గ్రామంలో పారిశుధ్య చర్యలు, వైద్య శిబిరాలు వెంటనే ఏర్పాటు చేయాలని సూచించారు. అలాగే బాధ్యత కుటుంబాన్ని అన్ని విధాలుగా ఆదుకుంటామని ఆయన భరోసా ఇచ్చారు.

కస్తూరి నాయుడు కండ్రిగ గ్రామంలో డిఎం అండ్ హెచ్ ఓ పర్యటన

సూటపల్లి పంచాయతీ కస్తూరినాడి కండ్రిగ గ్రామంలో తీవ్ర జ్వరంతో చెన్నై ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందిన కార్తికేయన్ మృతదేహాన్ని తిరుపతి డిఎం అండ్ హెచ్ ఓ సందర్శించి ఘన నివాళులు అర్పించారు. అనంతరం కార్తికేయన్ మృతికి గల కారణాలను అడిగి తెలుసుకున్నారు. తదనంతరం కస్తూరి నాయుడు కండ్రిగ గ్రామంలో డిఎం అండ్ హెచ్ వో వైద్యాధికారుల బృందంతో విస్తృతంగా పర్యటంచి ఇంటింటా వెళ్లి, అక్కడ ఈ పరిసరాల పరిశుభ్రతను, జ్వర పీడితులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామానికి ప్రత్యేక వైద్య బృందాన్ని రప్పించి వైద్య శిబిరాలను ఏర్పాటు చేసి, జ్వర బాధితులకు రక్త పరిశోధనలు చేసి వైద్య చికిత్సలు అందిస్తామని ఆయన తెలిపారు.

RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!