ePaper
Monday, September 21, 2026
📄 ePaper
Homeఎడిటోరియల్అంగన్‌వాడీ పోస్టుల భర్తీకి దరఖాస్తుల ఆహ్వానం - పిచ్చాటూరు ఐసిడిఎస్ సిడిపిఓ కే.రాజేశ్వరి

అంగన్‌వాడీ పోస్టుల భర్తీకి దరఖాస్తుల ఆహ్వానం – పిచ్చాటూరు ఐసిడిఎస్ సిడిపిఓ కే.రాజేశ్వరి

📰 Generate e-Paper Clip

పిచ్చాటూరు సెప్టెంబర్ 19 గరుడధాత్రి :

పిచ్చాటూరు ఐసీడీఎస్‌ ప్రాజెక్టు పరిధిలోని నాలుగు మండలాల్లో ఖాళీగా ఉన్న 19 అంగన్‌వాడీ కార్యకర్తలు, సహాయకుల పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు సీడీపీవో రాజేశ్వరి ఒక ప్రకటనలో తెలిపారు. ప్రాజెక్టు పరిధిలోని పిచ్చాటూరు, నాగలాపురం, కేవీబీ పురం, నారాయణవనం మండలాల్లోని అంగన్‌వాడీ కేంద్రాల్లో ఉన్న ఈ ఖాళీలను గుర్తించి, సామాజిక రిజర్వేషన్ల ఆధారంగా రోస్టర్‌ వివరాలను వెల్లడించారు.

మండలాల వారీగా ఖాళీల వివరాలు ఇలా..

పిచ్చాటూరు మండలం
పిచ్చాటూరు-1 (ఓసీ పీహెచ్‌సీ-వీహెచ్‌), రామాపురం మెయిన్‌ (ఓసీ ఈడబ్ల్యూఎస్‌), గాంధీనగర్‌ (బీసీ ఈ).

నాగలాపురం మండలం
ఏ.ఎన్‌.కండ్రిగ (బీసీ బీ), వజ్జవారికండ్రిగ (ఓసీ ఈడబ్ల్యూఎస్‌), వడ్డిపాలెం (ఓసీ పీహెచ్‌సీ), బీరకుప్పం (బీసీ బీ), కడివేడు (ఓసీ ఈడబ్ల్యూఎస్‌), జె.బి.కె.పురం ఎస్టీ కాలనీ (ఎస్టీ), వజ్జవారికండ్రిగ ఎస్టీ కాలనీ (ఎస్టీ).

కేవీబీ పురం మండలం
పోలినాయుడుకండ్రిగ (ఓసీ ఈడబ్ల్యూఎస్‌), మిద్దికండ్రిగ (బీసీ ఈ), కె.అడవారం ఎస్సీ (ఎస్సీ 2), కలత్తూరు ఎస్టీ (ఎస్టీ), ఎం.ఏ.రాజులకండ్రిగ ఎస్టీ (ఎస్టీ).
నారాయణవనం మండలం

పాలమంగళం బీసీ కాలనీ (బీసీ ఈ), చిధా స్పిన్నింగ్‌ మిల్ (బీసీ ఏ), ఎస్‌.ఎన్‌.కండ్రిగ (ఓసీ పీహెచ్‌-హెచ్‌హెచ్‌), పీహెచ్‌ వాడ (ఎస్సీ).అక్టోబరు 1 వరకు దరఖాస్తుల స్వీకరణ ఈ పోస్టులకు అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు సెప్టెంబరు 21 నుంచి అక్టోబరు 1వ తేదీ సాయంత్రం 5 గంటలలోపు దరఖాస్తులు సమర్పించాలని అధికారులు సూచించారు. దరఖాస్తు రుసుముగా రూ.100 చెల్లించాల్సి ఉంటుంది. అభ్యర్థులు పూర్తిగా నింపిన దరఖాస్తులను సంబంధిత ఐసీడీఎస్‌ ప్రాజెక్టు కార్యాలయంలో నేరుగా అందజేయాలని సీడీపీవో స్పష్టం చేశారు.

RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!