ePaper
Wednesday, September 23, 2026
📄 ePaper
Homeఎడిటోరియల్శ్రీవారి నాలుగు మాడ వీధుల్లో పటిష్ట భద్రతా చర్యలు

శ్రీవారి నాలుగు మాడ వీధుల్లో పటిష్ట భద్రతా చర్యలు

📰 Generate e-Paper Clip

– భక్తుల భద్రతకు ప్రత్యేక భద్రతా చర్యలు.

– స్పెషల్ బాంబ్ డిస్పోజల్ టీమ్స్‌తో నిరంతర తనిఖీలు.

– నాలుగు మాడ వీధులు, పరిసర ప్రాంతాల్లో క్షుణ్ణంగా తనిఖీలు.

– అనుమానాస్పద వస్తువులు కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని భక్తులకు సూచన.

తిరుపతి, సెప్టెంబర్ 19:
తిరుపతి *జిల్లా ఎస్పీ శ్రీ ఎల్. సుబ్బరాయుడు, ఐపీఎస్.,* గారి ఆదేశాల మేరకు శ్రీవారి బ్రహ్మోత్సవాల సందర్భంగా తిరుమలలోని నాలుగు మాడ వీధుల్లో పటిష్టమైన భద్రతా చర్యలు చేపడుతున్నారు. భక్తుల భద్రతకు అత్యంత ప్రాధాన్యతనిస్తూ భద్రతా సిబ్బందిని నిరంతరం అప్రమత్తంగా ఉంచుతున్నారు.

భద్రతా చర్యల్లో భాగంగా స్పెషల్ బాంబ్ డిస్పోజల్ టీమ్స్‌తో నాలుగు మాడ వీధులు, భక్తులు రాకపోకలు సాగించే ప్రాంతాలు, పరిసర ప్రదేశాల్లో క్రమం తప్పకుండా క్షుణ్ణంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. అనుమానాస్పద వస్తువులు, వ్యక్తులు లేదా ఇతర భద్రతాపరమైన అంశాలపై ప్రత్యేక నిఘా కొనసాగిస్తున్నారు.

గుర్తుతెలియని బ్యాగులు, ప్యాకెట్లు లేదా ఇతర అనుమానాస్పద వస్తువులు కనిపిస్తే వాటిని తాకకుండా, కదిలించకుండా వెంటనే సమీపంలోని పోలీసు సిబ్బందికి సమాచారం అందించాలని భక్తులకు సూచించారు. భద్రతా తనిఖీలకు భక్తులు పూర్తిగా సహకరించి, పోలీసుల సూచనలు పాటించాలని జిల్లా పోలీసు శాఖ విజ్ఞప్తి చేసింది.

శ్రీవారి బ్రహ్మోత్సవాలకు వచ్చే ప్రతి భక్తుడు సురక్షితంగా, ప్రశాంతంగా స్వామివారి దర్శనం చేసుకునేలా ముందస్తు భద్రతా చర్యలను సమర్థవంతంగా అమలు చేస్తున్నామని జిల్లా పోలీసు శాఖ తెలిపింది.

RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!