ePaper
Thursday, September 24, 2026
📄 ePaper
Homeఆంధ్రప్రదేశ్తిరుపతివిద్యారంగo అభివృద్ధిలో ఎంపీపీ లతా బాలాజీ నాయుడు సేవలు అమూల్యం

విద్యారంగo అభివృద్ధిలో ఎంపీపీ లతా బాలాజీ నాయుడు సేవలు అమూల్యం

📰 Generate e-Paper Clip

కార్వేటి నగరం సెప్టెంబర్ 23 (గరుడదాద్రి న్యూస్):

కార్వేటి నగరం మండలంలో గత ఐదు సంవత్సరాలుగా ఎంపీపీ పదవిని చేపట్టిన లతా బాలాజీ నాయుడు విద్యారంగంలో ఎంతో అమూల్య సేవలు అందించారని అవసరమైన తరగతి గదులు మంజూరు చేయడంలో ఉపాధ్యాయులకు అవసరమగు మౌలిక వసతులు కల్పించడంలో ఎంతో తోడ్పాటును అందించారని కార్వేటి నగరo మండల విద్యాశాఖ అధికారి విజయకుమార్ తెలియజేశారు ఐదు సంవత్సరాలుగా ఉపాధ్యాయులతో మంచి సత్సంబంధాలు కలిగి ఉపాధ్యాయులను విద్యాశాఖ అధికారులను ఎంతో ప్రోత్సహించి తోడ్పాటు అందించడం అమూల్యమని వారు మరింతగా ప్రజాసేవలో ముందుకు రావాలని మరింత మంచి స్థాయిలోకి వెళ్లాలని ఎంఈఓ మనోజ్ కుమార్ గారు తెలియజేశారు. ఈ సందర్భంగా వారికి ఉపాధ్యాయ సంఘ నాయకులు విద్యాశాఖ అధికారులు కలిసి జ్ఞాపికను అందజేసి దుశ్యాలువతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయ సంఘం నాయకులు చలపతిరావు,యువరాజు, గురుమూర్తి , పితాంబర్ రెడ్డి, గిరిబాబు, ప్రకాష్ పలువురు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!