ePaper
Thursday, September 24, 2026
📄 ePaper
Homeఆంధ్రప్రదేశ్తిరుపతిజాతీయ నులి పురుగుల దినోత్సవ సందర్భంగా గోడ పత్రికను ఆవిష్కరించిన వైద్య అధికారులు

జాతీయ నులి పురుగుల దినోత్సవ సందర్భంగా గోడ పత్రికను ఆవిష్కరించిన వైద్య అధికారులు

📰 Generate e-Paper Clip

కార్వేటినగరం సెప్టెంబర్ 23 (గరుడదాద్రి న్యూస్): జాతీయ నులి పురుగుల దినోత్సవం సందర్భంగా బుధవారం ఎంపీడీవో గారి కార్యాలయం నందు డాక్టర్ భువనేశ్వరి ఆధ్వర్యంలో రాధిక సింగిరెడ్డి , మండల విద్యాశాఖ అధికారులు విజయ్ కుమార్ మనోజ్ కుమార్ గోడపత్రికను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వైద్య అధికారి మాట్లాడుతూ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం కత్తిరిపల్లి పరిధిలో ఉన్నటువంటి 15 సచివాలయం పరిధిలో ఉన్నటువంటి అన్ని అంగన్వాడి స్కూల్స్ లలో అలాగే ఒకటవ తరగతి నుంచి పదవ తరగతి వరకు ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ప్రైవేట్ స్కూల్స్ నందు, అలాగే ఇంటర్మీడియట్ డిగ్రీ పాలిటెక్నిక్ ఐటిఐ కాలేజీలలో ఉన్నటువంటి మొత్తం విద్యార్థులు 6553 మందికి 25వ తారీకు శుక్రవారం రోజున పిల్లలకి డి వార్మింగ్ టాబ్లెట్స్ మింగించే కార్యక్రమం జరుగుతుంది. ఆరోజు ఎవరైనా అనారోగ్యంతో కావచ్చు, స్కూలుకి గ్రై హాజరు అయిన ఆల్బెండజోల్ టాబ్లెట్స్ మింగించడం జరుగుతుంది అని అధికారులు తెలియజేశారు..
ఈ కార్యక్రమం వల్ల పిల్లలు నులిపురుగులు నుంచి రక్షణ కలిగి వారికి విద్యతో పాటు ఆరోగ్యం మంచిగా ఉంటుందని తెలియజేశారు

RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!