ePaper
Thursday, September 24, 2026
📄 ePaper
Homeఆంధ్రప్రదేశ్తిరుపతిబాల్య వివాహాలను అరికట్టేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలి: జూనియర్ సివిల్ న్యాయమూర్తి లిఖిత

బాల్య వివాహాలను అరికట్టేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలి: జూనియర్ సివిల్ న్యాయమూర్తి లిఖిత

📰 Generate e-Paper Clip

పలమనేరు, సెప్టెంబర్ 23 ( గరుడ ధాత్రి ) :
సమాజంలో బాల్య వివాహాలను పూర్తిగా అరికట్టేందుకు ప్రతి ఒక్కరూ బాధ్యతగా సహకరించాలని పలమనేరు ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ న్యాయమూర్తి లిఖిత పిలుపునిచ్చారు. గంగవరం మండల పరిధిలోని కీలపట్ల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, కేజీబీవీ (K.G.B.V) కళాశాలలో న్యాయ విజ్ఞాన సదస్సులు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆమె ముఖ్య అతిథిగా హాజరై విద్యార్థులకు పలు చట్టాలు, సామాజిక అంశాలపై అవగాహన కల్పించారు. ర్యాగింగ్ చట్టం (యాంటీ ర్యాగింగ్ యాక్ట్), మహిళల అక్రమ రవాణా (ఉమెన్ ట్రాఫికింగ్) చట్టాలతో పాటు గుడ్ టచ్ – బ్యాడ్ టచ్ వంటి సున్నితమైన అంశాలపై విద్యార్థులకు అర్థమయ్యే రీతిలో వివరించారు. ప్రస్తుత రోజుల్లో సెల్ ఫోన్లలో మంచి, చెడు రెండు రకాల సమాచారం అందుబాటులో ఉంటుందని, విద్యార్థులు విచక్షణతో కేవలం మంచి విషయాలను మాత్రమే స్వీకరించి చెడుకు దూరంగా ఉండాలని సూచించారు. కేజీబీవీ పాఠశాల, కళాశాల ప్రాంగణంలో పారిశుధ్య నిర్వహణ, భోజనశాల వసతులను పరిశీలించిన న్యాయమూర్తి.. అక్కడి పరిస్థితుల పట్ల తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ ఇర్షాద్ అలీ ఖాన్, వైస్ ప్రెసిడెంట్ జి. కృష్ణమూర్తి, న్యాయవాదులు శ్రీరామ్ సమర్త్, అనిల్, మండల విద్యాశాఖ అధికారి శ్రీనివాసులు, పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు లత, ఉపాధ్యాయ సిబ్బంది మరియు విద్యార్థులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!