కాణిపాకం సెప్టెంబర్ 28 (గరుడ దాత్రి న్యూస్) కాణిపాకం దేవస్థానం బ్రహ్మోత్సవాల్లో భాగంగా సోమవారం చంద్రప్రభ వాహనంపై కాణిపాకం వరసిద్ధి వినాయక స్వామి భక్తులకు దర్శనమిచ్చాడు. ఉదయం అభిషేకం నిర్వహించి రాత్రి స్వామివారికి ఉదయదారులు ప్రత్యేక పూజలు నిర్వహించి స్వామివారిని మేళ తాళాలతో ఆలయం నుండి చంద్రప్రవాహనంపై తీసుకుని వచ్చి పూజలు నిర్వహించి వాహనాన్ని ప్రారంభించారు. మేళ తాళాలు వాయిద్య బృందాలు కోలాటాలు భజన నడుమవాహనం పురవీధుల గుండా బయలుదేరి పూజలు అందుకుంది. ఈ కార్యక్రమంలో ఈవో పెంచల కిషోర్ ఆలయ చైర్మన్.మ ణినాయుడు.ఉభయ దారులసంఘంఅధ్యక్షురాలు శివశంకరి.బోర్డు సభ్యురాలు వసంత. ఉభయ దారులుమాజీ ఈవో కేశవులు.రవి ప్రసాద్. నటరాజన్.రాజ్ కుమార్. బాబు.పరదేశి.సత్యనారాయణ. తదితరులు పాల్గొన్నారు. కాణిపాకం చిన్నకంపల్లి. వడ్రంపల్లె. 45 కొత్తపల్లి. చెగరపల్లె. తిరువనం పల్లె. 44 బొమ్మసముద్రం.అగరం పల్లె. పుణ్యసముద్రం. ఎగువ మారేడుపల్లె. దిగువ మారేడుపల్లె. సంత పల్లె. ఉత్తర బ్రాహ్మణ పల్లె. కారకంపల్లె.కాణిపాకపట్నం. పై పల్లె. సిద్ధం పల్లె గ్రామాల దళిత వంశస్థులు ఉభయదారులుగా వ్యవహరించారు.
