ePaper
Tuesday, September 29, 2026
📄 ePaper
Homeఆంధ్రప్రదేశ్తిరుపతిగడంవారిపల్లి వద్ద కేబుల్ దొంగతనం: నిందితుడిని పోలీసులకు అప్పగించిన స్థానికులు

గడంవారిపల్లి వద్ద కేబుల్ దొంగతనం: నిందితుడిని పోలీసులకు అప్పగించిన స్థానికులు

📰 Generate e-Paper Clip

చౌడేపల్లి సెప్టెంబర్ 28 గరుడధాత్రి న్యూస్ :

మండలం లోని గడంవారిపల్లి పరిధిలోని బండోని చెరువు వద్ద ఉన్న నాటేష్ అనే రైతు బోరు బావి కేబుల్ దొంగతనానికి గురైంది. ఆదివారం అర్ధరాత్రి సమయంలో దొంగతనానికి యత్నిస్తుండగా స్థానికులు, రైతు చాకచక్యంగా పట్టుకుని పోలీసులకు అప్పగించారు.
రైతుల కథనం మేరకు…
ఆదివారం రాత్రి బండోని చెరువు సమీపంలో ఉన్న నాటేష్ బోరు దగ్గర అనుమానాస్పదంగా సంచరిస్తూ కేబుల్ వైర్లను కట్ చేస్తున్న వ్యక్తిని గుర్తించారు వెంటనే అప్రమత్తమై అతడిని పట్టుకుని దేహశుద్ధి చేశారు. అనంతరం సమాచారం అందించి స్థానిక పోలీస్ స్టేషన్‌లో నిందితుడిని కేబుల్ వైర్లతో సహా అప్పగించారు.
పోలీసుల ప్రాథమిక విచారణలో నిందితుడు ఆమినిగుంటకు చెందిన చిరంజీవిగా గుర్తించారు.
రైతులు ఇచ్చిన ఫిర్యాదు పై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు

RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!