ePaper
Tuesday, September 29, 2026
📄 ePaper
Homeఆంధ్రప్రదేశ్తిరుపతిబేటరాయస్వామి ఆలయంలో అక్టోబర్ 3న శ్రీనివాస కల్యాణం

బేటరాయస్వామి ఆలయంలో అక్టోబర్ 3న శ్రీనివాస కల్యాణం

📰 Generate e-Paper Clip

* కల్యాణోత్సవ ఏర్పాట్లపై వివిధ శాఖల అధికారులతో సమన్వయ సమావేశం.
* భక్తులకు తగిన ఏర్పాట్లు చేయాలని కడాపిడి వికాస్మర్మత్, ప్రభుత్వ విప్ డాక్టర్ కంచర్ల శ్రీకాంత్, ఆర్టీసీ వైస్ చైర్మన్ మునిరత్నం, ఉడా చైర్మన్ సురేష్ బాబు.
కుప్పం,సెప్టెంబర్ 28 (గరుడ ధాత్రి న్యూస్):కుప్పం మండలం పరమసముద్రంలోని శ్రీ బేటరాయస్వామి ఆలయంలో అక్టోబర్ 3, న శ్రీనివాస కల్యాణం నిర్వహించనున్న నేపథ్యంలో ఏర్పాట్లపై వివిధ శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులతో సోమవారం సమన్వయ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో కల్యాణోత్సవానికి వచ్చే భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా అవసరమైన ఏర్పాట్లు, శాఖల మధ్య సమన్వయం, భద్రతా చర్యలు, ట్రాఫిక్ నియంత్రణ, తాగునీరు, పారిశుద్ధ్యం, వైద్య సదుపాయాలు తదితర అంశాలపై సమగ్రంగా చర్చించారు.కడ ప్రాజెక్ట్ డైరెక్టర్ వికాస్ మర్మత్ సమావేశంలో మాట్లాడుతూ, శ్రీనివాస కల్యాణానికి పెద్ద సంఖ్యలో భక్తులు హాజరయ్యే అవకాశం ఉన్నందున, ప్రజలకు అవసరమైన అన్ని సౌకర్యాలను ముందుగానే ఏర్పాటు చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. భక్తుల రాకపోకలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా పార్కింగ్, ట్రాఫిక్ నియంత్రణ, తాగునీరు, పారిశుద్ధ్యం, విద్యుత్, వైద్య సేవలు, భద్రత తదితర అంశాలపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. ప్రతి శాఖ తమకు అప్పగించిన బాధ్యతలను సమన్వయంతో పూర్తి చేసి, కల్యాణోత్సవం ప్రశాంతంగా జరిగేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు.
ఈ సమావేశంలో ప్రభుత్వ విప్, ఎమ్మెల్సీ శ్రీ కంచర్ల శ్రీకాంత్, ఆర్టీసీ వైస్ చైర్మన్ పి.ఎస్. మునిరత్నం, పీకేఎం యూడీఏ చైర్మన్ డాక్టర్ సురేష్బాబు, సంబంధిత శాఖల అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మార్గదర్శకత్వంతో, తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) వారి ఆధ్వర్యంలో పరమసముద్రంలోని శ్రీ బేటరాయస్వామి ఆలయంలో శ్రీనివాస కల్యాణోత్సవాన్ని నిర్వహించేందుకు ఏర్పాట్లు చేపడుతున్నట్లు ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్ తెలిపారు.
భక్తులకు ఆధ్యాత్మిక అనుభూతితో పాటు సౌకర్యవంతమైన వాతావరణం కల్పించేలా అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని అధికారులకు పి.ఎస్. మునిరత్నం సూచించారు. నేతలు శాంతారామ్,వెంకటేష్, సెల్వరాజ్, చంద్రబాబు కార్యదర్శి శ్రీకాంత్ పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!