ePaper
Tuesday, September 29, 2026
📄 ePaper
Homeఆంధ్రప్రదేశ్తిరుపతిసమాజ శ్రేయస్సు కోసం ఐక్యంగా పనిచేద్దాం-కుప్పంలో వాల్మీకి సంఘ సమావేశం

సమాజ శ్రేయస్సు కోసం ఐక్యంగా పనిచేద్దాం-కుప్పంలో వాల్మీకి సంఘ సమావేశం

📰 Generate e-Paper Clip

కుప్పం,సెప్టెంబర్ 29 (గరుడ ధాత్రి న్యూస్):మానవాళికి ఆదికావ్యం రామాయణాన్ని ప్రసాదించిన పరమ పవిత్ర మూర్తి, అఖిల వాల్మీకి జన హృదయ నేత శ్రీ మహర్షి వాల్మీకి గారి ఆశీస్సులతో కుప్పంలో వాల్మీకి సంఘ సమావేశం నిర్వహించారు. కుప్పం మున్సిపాలిటీ 19వ వార్డు లో గల ప్యాలెస్ నందు వాల్మీకి సంఘం ఆధ్వర్యంలో ముఖ్య నాయకులు మరియు సభ్యుల సమక్షంలో వాల్మీకి సంఘం సమావేశం అత్యంత ఘనంగా జరిగింది. ఈ సమావేశంలో సంఘ ప్రగతి, భవిష్యత్ కార్యక్రమాలు మరియు సమాజ ఉన్నతికి సంబంధించిన పలు కీలక అంశాలపై చర్చించడం జరిగింది. సమాజ శ్రేయస్సు కోసం, ఐక్యత కోసం కట్టుబడి పనిచేస్తామని ఈ సందర్భంగా ప్రతి ఒక్కరూ సంకల్పించారు ఈ కార్యక్రమంలో మా వాల్మీకి కుల గురువైన సురేష్ బాబు , కౌన్సిలర్ జిమ్ దాము , సురేష్ నాయుడు ,విభూషణ్ , పాండు , నాగభూషణం , రాఘవ కుబేన్ద్ర , శివ, రామచంద్ర, ప్రభాకర్, రవీంద్ర నాయుడు మరియు వాల్మీకి కులస్తులు పాల్గొన్నారు

RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!