* 201 క్లస్టర్లలో లక్ష కోట్ల పెట్టుబడులతో అభివృద్ధి.
* మదనపల్లెలో నేడు హార్టికల్చర్ హబ్ ప్రాజెక్టుకు శ్రీకారం.
* ఇండియన్ స్కూల్ ఆఫ్ అగ్రికల్చరు శంకుస్థాపన.
* మదనపల్లెకు నేడు సీఎం చంద్రబాబు, కేంద్రమంత్రి నిర్మల సీతారామన్ లు రాక.
* ఏర్పాట్లను పర్యవేక్షించిన ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి.
చిత్తూరు బ్యూరో, అక్టోబర్ 01(ఆర్.శ్రీనివాసులు,గరుడ ధాత్రి న్యూస్): రాయలసీమలోని ఉద్యాన పంటల హబ్ ను గ్లోబల్ ఫ్రూట్ బౌల్గా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. నేడు శుక్రవారం అన్నమయ్య జిల్లా మదనపల్లెలో ఇండియన్ స్కూల్ ఆఫ్ అగ్రికల్చర్కు శంకు స్థాపన చేసి ఉద్యాన హద్కు శ్రీకారం చుట్టనున్నారు. గతంలో కరువు, వర్షాభావంతో వెనుకబడిన రాయలసీమను ప్రపంచస్థాయి ఉద్యాన పంటల కేంద్రంగా తీర్చిదిద్దేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చర్యలు తీసుకుంటున్నారు. ఉమ్మడి ప్రకాశంతో కలిపి రాయలసీమ లోని 10 జిల్లాల్లో 201 క్లస్టర్లతో రాయలసీమ ఇంటిగ్రేటెడ్ హార్టీకల్చర్ హట్గా అభివృద్ధి చేయనున్నారు.ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యంతో సుమారు లక్ష కోట్ల పెట్టుబడు లతో చేపట్టనున్న అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుడుతున్నారు. ఇందులో ప్రభుత్వం రూ.40 వేల కోట్లు, ప్రైవేటు రంగం రూ.60 వేల కోట్ల పెట్టుబడులతో రాయలసీమ ప్రాంతాన్ని ఉద్యాన పంటల హట్గా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నారు. రాయలసీమ హార్టీకల్చర్ హబ్ కార్యక్రమంలో రైతులు, ప్రజలను పెద్దఎత్తున భాగస్వాములను చేస్తూ పండుగలా నిర్వహించనున్నారు. గతంలో రాయలసీమలో తీవ్రమైన కరవు, వర్షాభావ పరిస్థితులు ఉండేవి. ఇప్పుడు ఆ పరిస్థితులను మార్చి అభివృద్ధి దిశగా వివిధ కార్యక్రమాలు చేపట్టేందుకు సిద్ధమవుతున్నారు .సూక్ష్మ సేద్యం నుంచి హంద్రీనీవా, గాలేరు-నగరి ప్రాజెక్టుల ద్వారా కరవు సీమకు నీటిని తరలించడంతో పాటు, ఫామ్ పాండ్లు, చెక్ డ్యామ్ల నిర్మాణం వంటి చర్యలతో వ్యవసాయానికి అనుకూల వాతావరణం ఏర్పడింది. హంద్రీనీవా కాలువ ద్వారా సుమారు 660 కిలోమీటర్ల మేర కుప్పం వరకు నీటిని తీసుకువచ్చారు. కియా నుంచి అమ్కా డిఫెన్సు ప్రాజెక్టు వరకూ పరిశ్రమల ఏర్పాటుతో రాయలసీమలో పారిశ్రామిక మార్పు చోటుచేసుకుంది. ఇప్పుడు ఉద్యాన రంగం ద్వారా తదుపరి స్థాయి ఆర్థిక పరివర్తన సాధించేందుకు చర్యలు తీసుకుంటున్నారు. కరువును అవకాశంగా మార్చుకుని క్షామం నుంచి అభివృద్ధి వైపు రాయలసీమ రూపాంతరం చెందుతోంది.201 క్లస్టర్లలో ఉద్యాన పంటల కార్యాచరణ:
10 జిల్లాల్లోని 201 క్లస్టర్లలో ఉద్యాన పంటలు, ఎఫ్పీఓలు, ఆహార శుద్ధి పరిశ్రమలు, మార్కెటింగ్ వ్యవస్థలను అనుసంధానం చేయనున్నారు.
క్లస్టర్, నియోజకవర్గ, జిల్లా, రాష్ట్ర స్థాయుల్లో రైతు ఉత్పత్తిదారుల సంస్థలను బలోపేతం చేసేందుకు చర్యలు తీసుకుంటున్నారు. డ్వాక్రా సంఘాల తరహాలో రైతులు వరస్పరం సహకరించుకుంటూ ఎఫ్పీఓలుగా ఏర్పడి తమ ఉత్పత్తులను సమష్టిగా మార్కెట్ చేసుకునే విధానాన్ని ప్రోత్సహించేందుకు చర్యలు తీసుకుంటున్నారు. ఉద్యాన పంటల సాగులో కొత్త రకాల పంటల ఎంపిక, ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమల ఏర్పాటు, మార్కెటింగ్ అవకాశాలపై రైతులకు అవగాహన కల్పించనున్నారు. అంతర్జాతీయ డిమాండ్ ఉన్న పంటలపై దృష్టి సారించి ఫలితాలు సాధించేలా రైతులను ప్రోత్సహిస్తున్నారు. రాయలసీమలో వివిధ రకాల పండ్లను ఉత్పత్తి చేసే సామర్థ్యం ఉండగా, ఇక్కడ ఉత్పత్తి అయ్యే అనేక రకాల పండ్లకు ప్రపంచ మార్కెట్లో ఉన్న అవకాశాలను అందిపుచ్చుకోనుంది. రాయలసీమ ఇంటిగ్రేటెడ్ హార్టీకల్చర్ హబ్ ద్వారా వచ్చే 5-6 ఏళ్లలో రాయలసీమను తదుపరి స్థాయికి తీసుకెళ్లాలని సీఎం లక్ష్యంగా చర్యలు తీసుకుంటున్నారు. జిల్లాల కలెక్టర్లు తమ ప్రాంతాల్లోని అవకాశాలను గుర్తించి విని యోగించుకోనున్నారు. ప్రతి క్లస్టర్లో రైతులను చాంపియన్ ఫార్మర్లుగా రైతులను తీర్చిదిద్దేలా కార్యాచరణ రూపొందిస్తున్నారు.గాంధీ జయంతిని పురస్కరించుకుని ఇంటిగ్రేటెడ్ హార్టీకల్చర్ హబ్ కార్యక్రమాన్ని ప్రారంభించడం సంతోషదా యకమని సీఎం వ్యాఖ్యానించారు. అలాగే ఇండియన్ స్కూల్ ఆఫ్ అగ్రికల్చర్కు కూడా శంకుస్థాపన చేయనున్నట్టు తెలిపారు. మన ఉద్యాన ఉత్పత్తులు విదేశీ మార్కెట్లకు ఎగుమతి చేసేలా ఈ హటు శ్రీకారంచుడుతున్నామని స్పష్టం చేశారు. ఉమ్మడి ప్రకాశం సహా రాయలసీమ జిల్లాల్లోని 201 క్లస్టర్ల లోని రైతులను కూడా వర్చువల్గా ఈ కార్యక్రమంలో భాగస్వాములను చేయాలని సూచించారు. 3 వేల పైచిలుకు రైతు సేవా కేంద్రాల్లో ప్రదర్శనలు క్లస్టర్ వారీగా కార్యక్రమాలు నిర్వహించి ఉద్యాన హబ్ ఆవిర్భా వాన్ని పండుగ వాతావరణంలో నిర్వహించాలని చెప్పారు. రాయలసీమ సంస్కృతి ప్రతిబింబించేలా సాంస్కృతిక కార్యక్రమా లు ఏర్పాటు చేయాలని సూచించారు. క్లస్టర్ స్థాయిలో వర్క్షాప్ లు, ట్రాక్టర్ ర్యాలీలు, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించి విస్తృత ప్రచారం కల్పించాలని ఆదేశించారు. ఉద్యాన పంటల సాగు ద్వారా రైతుల జీవితాల్లో వచ్చిన మార్పులను ప్రజలకు తెలియజేయాలని సూచించారు. ఉద్యాన పంటల ద్వారా పెరిగిన రైతుల ఆదాయం, కొత్త పంటలతో వారి జీవన ప్రమాణాలు ఎలా మారాయన్న అంశాలను తెలియచెప్పాలని స్పష్టం చేశారు. రాయలసీమ హార్టీకల్చర్ హద్నూ ప్రజలు స్వాగతించేలా కార్యక్రమాన్ని నిర్వహించాలని ఆదేశించారు.
ఎల్సినో ప్రభావంతో వ్యవసాయ రంగంపై పడే ప్రభావాన్ని తగ్గించేందుకు ప్రత్యామ్నాయ పంటల సాగుపై సీఎం సమీక్షిం చారు. ఉత్పత్తి, వినియోగం, వాణిజ్య అవకాశాలను పరిగణనలోకి తీసుకుని వంటల ప్రణాళిక రూపొందించాలని సూచించారు. శనగ, మినుము, పెసర, కంది, రాగులు, మొక్కజొన్న, జొన్నలు, ఉల్లి తదితర పంటల సాగు, కొనుగోళ్లు, కనీస మద్దతు ధరల అంశాలపై కేంద్రాన్ని సంప్రదించాలని నిర్ణయించారు. ప్రత్యామ్నాయ పంటల ద్వారా ప్రతీ ఎకరానూ సాగులోకి తీసుకురావటం ద్వారా ఎల్సినో ప్రభావాన్ని పూర్తిస్థాయిలో ఎదుర్కోవాలని స్పష్టం చేశారు. వ్యవసాయ శాఖలో ఏఐ ఆధారిత విశ్లేషణ వ్యవస్థను ఉపయోగించి ఏ ప్రాంతంలో ఏ పంట సాగు చేస్తే రైతులకు, వినియోగదారులకు ప్రయోజనం ఉంటుందో గుర్తించాలని సూచిం చారు.ద్రవ్యోల్బణం పెరగకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని ఆదేశించారు. పప్పు దినుసులు, చిరు ధాన్యాల లాంటి 14 రకాల వంటల ధరలపై నిరంతరం పర్యవేక్షణ ఉండాలని, రైతులకు గిట్టుబాటు ధర లభించేలా, వినియోగదారులకు ధరల భారం పడకుండా సమతుల్య విధానం అవలంబించాలని సూచించారు. ఇకపై ప్రతి వారం ద్రవ్యోల్బణంపై సమీక్ష నిర్వహిస్తానని తెలిపారు. ఆరోగ్యపరంగా ప్రజలు వంటనూనె వినియోగాన్ని పరిమితం చేసుకునేలా అవగాహన కల్పించాలని తెలిపారు. రాగి, జొన్న, సజ్జ తదితర చిరు ధాన్యాల వినియోగాన్ని పెంచేలా ప్రజల్లో చైతన్యం తీసుకురావాలని సూచించారు. ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లపై విస్తృత ప్రచారం నిర్వహించాలని అధికారులను ఆదేశించా రు. నంద్యాల, కర్నూలు, అన్నమయ్య, చిత్తూరు, మార్కాపురం, శ్రీసత్యసాయి, అనంతపురం, కడప జిల్లాల కలెక్టర్లతో వర్షాలు, పంటల సాగుపై సమీక్ష కూడా ముఖ్యమంత్రి నిర్వహించారు.
నేడు మదనపల్లి కు రాక: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మల సీతారామన్ లు నేడు మదనపల్లెకు రానున్నారు. హార్టికల్చర్ హబ్బును ప్రారంభించనున్నారు. ఈ కార్యక్రమాలను విజయవంతం చేసేందుకు పలమనేరు ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి పర్యటన ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు.
