ePaper
Monday, October 5, 2026
📄 ePaper
Homeఆంధ్రప్రదేశ్తిరుపతికాణిపాకం వరసిద్ధి వినాయక స్వామిని దర్శించుకున్న మంత్రి అచ్చెన్నాయుడు

కాణిపాకం వరసిద్ధి వినాయక స్వామిని దర్శించుకున్న మంత్రి అచ్చెన్నాయుడు

📰 Generate e-Paper Clip

కాణిపాకం అక్టోబర్ 1 గరుడధాత్రి :

స్వయంభు శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారిని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరపు అచ్చెన్నాయుడు కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు.
ఈ సందర్భంగా దేవస్థానం చైర్మన్ మణి నాయుడు, ఆలయ ఏఈఓ రవీంద్రబాబు మంత్రికి స్వాగతం పలికి స్వామివారి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనం అనంతరం స్వామివారి తీర్థప్రసాదాలు, శేషవస్త్రం, స్వామివారి చిత్రపటాన్ని మంత్రికి అందజేశారు.
ఈ కార్యక్రమంలో ట్రస్ట్ బోర్డు సభ్యులు కృష్ణవేణి, వసంత, సూపరింటెండెంట్ కోదండపాణి, టెంపుల్ ఇన్‌స్పెక్టర్ బాలాజీ నాయుడు, సీఐ శ్రీధర్ నాయుడు, కాణిపాకం ఎస్సై, స్థానిక నాయకులు, ప్రజాప్రతినిధులు, చిత్తూరు వ్యవసాయ శాఖ అధికారులు, దేవస్థాన సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!