చౌడేపల్లి అక్టోబర్ 02 గరుడు దాత్రి న్యూస్
మండల కేంద్రమైన చౌడేపల్లి లో గాంధీజీ జయంతిని ఘనంగా నిర్వహించారు శుక్రవారం స్థానిక బజారు వీధిలోని గాంధీ విగ్రహం వద్ద పూలమాలలు వేసి నివాళులు అర్పించారు వాసవి వనిత క్లబ్ , వాసవి క్లబ్, వాసవి సేవకులుఆధ్వర్యంలో జయంతి వేడుకలను నిర్వహించారు స్వాతంత్ర పోరాటంలో గాంధీజీ వ్యవహరించిన తీరును అందరికీ వినిపించారు నేటి యువత అహింసను ఆయుధంగా మార్చుకుని అన్ని రంగాలలో ముందుకు రావాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ మల్టిపుల్ కోశాధికారి ఇస్సా నాగలక్ష్మి, వాసవి క్లబ్ గౌరవాధ్యక్షులు రాంకుమార్ వాసవి క్లబ్ వాసవి వనిత క్లబ్ అధ్యక్షులు శ్రీనాథ్, రంగవల్లి కార్యదర్శులు లోకేష్ , నాగలక్ష్మి కోశాధికారి అమర వాసవి సేవకులు రంగనాథ్ బాబు, ఆంజనేయులు, పాండురంగయ్య, మదన్ మోహన్ కృష్ణమూర్తి,వాసవి వనిత క్లబ్ సభ్యులు ఆర్యవైశ్య సంఘం నాయకులు మహిళా మండలి సభ్యులు తదితరులు పాల్గొన్నారు
