చౌడేపల్లి అక్టోబర్ 02 గరుడ దాత్రి న్యూస్
పుంగనూరు నియోజకవర్గం అడివి నాదకుంట పర్యవర్ధన సాంఘిక మార్పు సమైక్య వ్యవస్థాపక అధ్యక్షులు ఎస్కే యూనివర్సిటీ గ్రాంట్స్ విశ్రాంతి ప్రొఫెసర్ గాంధీ వెంకట్ రెడ్డి వాళ్ళ కుమార్తె సహన కార్యదర్శి ఆధ్వర్యంలో మహాత్మా గాంధీ 157 వ జయంతి అలాగే లాల్ బహుదూర్ శాస్త్రి ఇద్దరి జయంతి మోడల్ స్కూల్ హాస్టల్ విద్యార్థులు గ్రామస్తులు కలిసి ఘనంగా జరపడం జరిగింది .ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం బ్రాందీ బెల్ట్ షాపులు లేకుండా చేయటం అలాగే ఎస్సి మాలల కాలనీ పూజారి బ్రాహ్మణ మరియు కాపు రెడ్డి ఇతర కులస్తుల కలిసి ఎస్సీ కులాల వారి ఇంటి లోనికి ప్రవేశించి వాళ్ళ వద్ద భోజనం నీళ్లు తాగటం జరిగింది దీని వలన కుల నిర్మూలన చేయటానికి పునాది అలాగే గుడి ప్రవేశం జరిగినది మోడల్ స్కూల్ దగ్గర ఇంటర్మీడియట్ వరకు ఉన్నది ఈ అడవి నాదకుంటలో బెల్ట్ షాపులు లేకుండా చేయటానికి పునాది వేయడం జరిగింది ఈరోజు సాయంత్రం సహబంతి భోజనం తో పాటు గ్రామస్థులతో కల్చరల్ ప్రోగ్రాం చేయడం జరిగింది. గ్రామంలో గాంధీ పటం ఊరేగింపు జరిగింది .గ్రామం ను ఆదర్శంగా తీర్చుకొని తాగుడు లేకుండా పిల్లలను బాగా చదివించుకోవాలని ఈ కార్యక్రమం లో అంబేద్కర్ వ్యవస్థాపకుడు బ్యాంక్ రెడ్డప్ప మరియు విశ్రాంతి ప్రధాన ఉపాధ్యాయుడు తెలుగు పండిట్ చిన్న స్వామి అంబేద్కర్ సేవా సమితి వ్యవస్థాపకులు ఎం మునుస్వామి పి వెంకటరమణ, శివ ,మాజీ సర్పంచ్. శంకర్ రెడ్డి భాస్కర్ రెడ్డి పై కార్యక్రమంలో పాల్గొన్నారు
