ePaper
Saturday, October 3, 2026
📄 ePaper
Homeఆంధ్రప్రదేశ్తిరుపతివృద్ధాప్య పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే ఆదిమూలం

వృద్ధాప్య పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే ఆదిమూలం

📰 Generate e-Paper Clip

సత్యవేడు అక్టోబర్ 3 గరుడధాత్రి:

తిరుపతి జిల్లా సత్యవేడు మండలం దాసుకుప్పం పంచాయతీలో గురువారం వృద్ధాప్య పెన్షన్ల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. స్థానిక ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం స్థానిక నాయకులతో కలిసి లబ్ధిదారులకు వృద్ధాప్య పెన్షన్లను పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా లబ్ధిదారులతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో టీడీపీ సీనియర్ నేత సుందరరామిరెడ్డి, రవిరెడ్డి, లోకయ్యరెడ్డి, ఎంఈఓ రవి, మహిళా పోలీస్ లక్ష్మీ, విజయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. పలువురు పెన్షన్ లబ్ధిదారులు కార్యక్రమానికి హాజరయ్యారు.

RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!