ePaper
Sunday, October 4, 2026
📄 ePaper
Homeఆంధ్రప్రదేశ్తిరుపతిపర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలి

పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలి

📰 Generate e-Paper Clip

*చిత్తూరు ఎంపీ దగ్గుమళ్ళ ప్రసాదరావు పిలుపు

కార్వేటినగరం అక్టోబర్ 3 గరుడదాద్రి న్యూస్
పర్యావరణ పరిరక్షణలో చెట్లు అత్యంత కీలక పాత్ర పోషిస్తాయని, ప్రతి ఒక్కరూ బాధ్యతగా మొక్కలు నాటి వాటిని సంరక్షించాలని చిత్తూరు పార్లమెంటు సభ్యులు దగ్గుమళ్ళ ప్రసాదరావు పిలుపునిచ్చారు.శనివారం కార్వేటినగరంలోని రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి సభ్యులు నాగేశ్వర రాజు వ్యవసాయ క్షేత్రాన్ని చిత్తూరు ఎంపీ దగ్గుమళ్ళ ప్రసాదరావు సందర్శించారు.ఈ సందర్భంగా ఆయన వ్యవసాయ క్షేత్రంలో శ్రీగంధం మొక్కను నాటి,నీరు పోశారు.అనంతరం చిత్తూరు ఎంపీ దగ్గుమళ్ళ ప్రసాదరావు మాట్లాడుతూ.. పెరుగుతున్న కాలుష్యాన్ని అరికట్టడానికి మరియు భావితరాలకు స్వచ్ఛమైన గాలిని అందించడానికి పెద్ద ఎత్తున వృక్షోపణ జరగాలన్నారు. ప్రకృతి సమతుల్యతను కాపాడుకోవడం మనందరి బాధ్యత అని, అందుకోసం ప్రతి ఒక్కరూ తమ వంతుగా మొక్కలు నాటడాన్ని ఒక ఉద్యమంలా చేపట్టాలని కోరారు. పర్యావరణ పరిరక్షణకు నిరంతరం కృషి చేస్తున్న రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి సభ్యులు నాగేశ్వర రాజుని ఈ సందర్భంగా ఆయన అభినందించారు.ఈ సందర్భంగా ఆయన అభినందించారు. అనంతరం నాయకులు ఎంపీ వారిని ఘనంగా సన్మానించారు.
ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు చెంగల్రాయ్ యాదవ్, ప్రధాన కార్యదర్శి రాజా, నాయకులు రాజశేఖర్ నాయుడు, తెలుగుదేశం పార్టీ జిల్లా ఉపాధ్యక్షులు రవి యాదవ్, బీగాలరమేష్,రవికుమార్, నాగభూషణం రెడ్డి, చిరంజీవి, రవిరాజు, రాము, మోహన్ రామిరెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!