ePaper
Wednesday, October 7, 2026
📄 ePaper
Homeఆంధ్రప్రదేశ్తిరుపతినీటి గుంటలో వ్యక్తి అనుమానాస్పద మృతి

నీటి గుంటలో వ్యక్తి అనుమానాస్పద మృతి

📰 Generate e-Paper Clip

చౌడేపల్లి అక్టోబర్ 04 గరుడ దాత్రి న్యూస్

చౌడేపల్లి మండలం కాగితి పంచాయతీ అన్నెపల్లి గ్రామానికి చెందిన బి. హరినాథ్‌రెడ్డి (38) ఆదివారం నీటి గుంటలో అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. ఉదయం పొలానికి వెళ్లి వస్తానని ఇంటి నుంచి వెళ్లిన ఆయన నీటి గుంటలో మృతిచెంది ఉండటాన్ని స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. స్థానికుల సమాచారం మేరకు.. హరినాథ్‌రెడ్డి ఇంట్లో కుటుంబ సభ్యుల మధ్య గొడవ జరిగినట్లు తెలుస్తోంది. దీంతో ఆయన మృతిపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సమాచారం అందుకున్న చౌడేపల్లి పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పంచనామా నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు పోలీసుల విచారణలో తేలాల్సి ఉంది.

RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!