* 2025 ఆగస్టు 15న పథకాన్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు.
* మహిళలు బాలికలు ట్రాన్స్ జెండర్ లకు ఉచిత ప్రయాణ సౌకర్యం కోసం ఈ పథకం.
* పథకం కొనసాగుతున్న తీరుపై సీఎం చంద్రబాబు హర్షం.
* శ్రీ శక్తి పథకాన్ని సద్వినియోగం చేసుకుంటున్న మహిళలు.
* ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ విప్ డాక్టర్ కంచర్ల శ్రీకాంత్.
చిత్తూరు బ్యూరో, అక్టోబర్ 08 (ఆర్.శ్రీనివాసులు,గరుడ ధాత్రి న్యూస్): కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆంధ్ర ప్రదేశ్‌లో అమలు చేసిన శ్రీ శక్తి పథకం విజయవంతంగా కొనసాగుతోంది. మహిళలు, బాలికలు మరియు ట్రాన్స్ జెండర్లకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించి వారి ఆర్థిక భారాన్ని తగ్గించడం, మహిళా సాధికారతను ప్రోత్సహించడం లక్ష్యంతో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ పథకాన్ని రూపొందించారు. తన ఎన్నికల హామీలో భాగంగా సూపర్ సిక్స్ లో ఈ హామీని పొందుపరిచారు. ఎన్నికల అనంతరం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక శ్రీ శక్తి పథకాన్ని కొనసాగించారు. 2025 ఆగస్టు 15వ తేదీన శ్రీ శక్తి పథకాన్ని ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం ప్రారంభించింది. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అట్టహాసంగా శ్రీ శక్తి పథకాన్ని ప్రారంభించారు. ప్రారంభ సందర్భంగా మహిళల తోపాటు బస్సులో ప్రయాణించి మహిళల మనోవతాన్ని తెలుసుకున్నారు. ఈ పథకం తమకు ఎంతో ఉపయోగకరమని మహిళలు చంద్రబాబు దృష్టికి తీసుకువచ్చారు. ఈ పథకం ద్వారా పల్లె వెలుగు, అల్ట్రా పల్లె వెలుగు, సిటీ ఆర్డినరీ, ఎక్స్‌ప్రెస్ మరియు మెట్రో ఎక్స్‌ప్రెస్ బస్సులలో ఉచితంగా ప్రయాణం చేసే అవకాశం కల్పించారు. మహిళలు బస్సుల్లో ఆధార్ కార్డును చూపి జీరో ఫేర్ టికెట్‌ను తీసుకోవాలి. ఈ విధంగా ఆనాటి నుంచి ఈ పథకం కొనసాగుతూ ముందుకు దూసుకుపోతోంది. 2026 అక్టోబర్ ఐదు నాటికి రాష్ట్రంలో ఉచిత బస్సు ప్రయాణాలు 100 కోట్ల రాయిని దాటింది. అధికారిక లెక్కల ప్రకారం రోజువారి రాష్ట్రంలో సగటున 24 లక్షల మంది మహిళలు ఉచిత బస్సు సౌకర్యాన్ని వినియోగించుకుంటున్నారు. శ్రీ శక్తి పథకం ద్వారా మహిళలకు ప్రయాణ ఖర్చుల రూపంలో 3,550 కోట్ల రూపాయలు ఆదా అయ్యాయి. ఈ మొత్తం వ్యవహారానికి గాను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏపీఎస్ఆర్టీసీకి ప్రతి నెల 160 కోట్ల రూపాయలు చెల్లిస్తోంది. ఆగస్టు నాటికి 2,160 కోట్ల రూపాయలను ప్రభుత్వం విడుదల చేసినట్లు తెలుస్తోంది. ఈ శ్రీ శక్తి పథకం ద్వారా మహిళలకు భరోసా లభిస్తున్నది. చదువుకునే విద్యార్థినులకు, ఉద్యోగాలకు వెళ్లే మహిళలకు ఈ పథకం ఎంతగానో ఉపయోగపడుతుంది. మహిళలకు ఆదా అయ్యే డబ్బులు పిల్లల చదువులకు, కుటుంబ పోషణకు మహిళలు వినియోగించుకోవడం విశేషం.
ఏపీలో కూటమి ప్రభుత్వం మహిళల కోసం ప్రతిష్ఠాత్మకంగా ప్రవేశపెట్టిన స్త్రీ శక్తి ఉచిత బస్సు ప్రయాణ పథకం ఆల్ టైమ్ రికార్డు సృష్టించింది. రాష్ట్రంలో మహిళలకు ప్రజా రవాణాను సులభతరం చేస్తూ, వారి ప్రయాణ ఖర్చుల భారాన్ని తగ్గించడమే లక్ష్యంగా ప్రారంభమైన ఈ పథకంలో ఇప్పటివరకు ఉచితంగా జారీ చేసిన ప్రయాణ టికెట్ల సంఖ్య ఏకంగా 100 కోట్ల మార్కును దాటేసింది. ఈ ఘనతపై సీఎం చంద్రబాబు నాయుడు, ఆర్టీసీ యాజమాన్యం హర్షం వ్యక్తం చేశాయి. రోజుకి సగటున 24 లక్షల మంది మహిళలు, విద్యార్థినులు, ఉద్యోగినులు ఈ పథకం ద్వారా ఉచితంగా ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణిస్తున్నారని అధికారులు వెల్లడించారు. ఉచిత టికెట్ల జారీ ద్వారా రాష్ట్రంలోని మహిళలకు ఇప్పటివరకు సుమారు రూ. 3,500 కోట్ల మేర ప్రయాణ వ్యయం ఆదా అయిందని ఆర్టీసీ లెక్కలు చెబుతున్నాయి.
ఎన్నికల హామీలను అమలు చేస్తున్నాం: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ అభివృద్ధి డాక్టర్ కంచర్ల శ్రీకాంత్: కూటమి ప్రభుత్వం ఎన్నికల హామీలను అమలు చేస్తోందని ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వ విప్, శాసనమండలి సభ్యులు డాక్టర్ కంచర్ల శ్రీకాంత్ పేర్కొన్నారు. మహిళల ప్రయాణాలు 100 కోట్ల మైలురాయిని దాటిన సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ హర్షం వ్యక్తం చేశారు. ఆర్థిక సమస్యలు ఉన్నప్పటికీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మహిళల కోసం ఈ పథకాన్ని అమలు చేస్తున్నారన్నారు. మహిళలు ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకుంటున్నారని అన్నారు.
