ePaper
Friday, October 9, 2026
📄 ePaper
Homeఆంధ్రప్రదేశ్తిరుపతిగర్భిణీలు, బాలింతలకు పౌష్టికాహారం అవసరం

గర్భిణీలు, బాలింతలకు పౌష్టికాహారం అవసరం

📰 Generate e-Paper Clip

* అంగన్వాడి వారోత్సవాల్లో బిజెపి నేతలు.
కుప్పం, అక్టోబర్ 08 (గరుడ ధాత్రి న్యూస్): గర్భిణీలు, బాలింతలు, చిన్నారులకు పౌష్టికాహారం అవసరమని భారతీయ జనతా పార్టీ నాయకులు పేర్కొన్నారు. కుప్పం రూరల్ మండల పరిధిలోని నడుమూరు పంచాయతి నడుమూరు, బైరప్ప కొట్టాలు, తొట్లమ్మగుడి, వెండుగంపల్లి బీసీ కాలనీలలో ప్రధాని నరేంద్ర మోడీ జన్మదిన సందర్భంగా జరుపుతున్న అంగన్వాడీ దినోత్సవాలలో భాగంగా పోషణ మాసోత్సవాలు నిర్వహించారు. ఇందులో గర్భిణీలు, బాలింతలు, మరియు చిన్నారులకు పొష్టికాహారం మరియు ఆరోగ్యం పట్ల అవగాహన కల్పించారు.
ఈ కార్యక్రమంలో బిజేపి కుప్పం రూరల్ మండల అధ్యక్షులు వడివేలు,అర్బన్ అధ్యక్షులు వినీల్, శాంతిపురం అధ్యక్షులు గజేంద్ర మరియు బిజేపి పార్టీ నాయకులు పళని,బెటరాయ కనకప్ప మునివెల్ తిరుమలేష్, సూపర్వైజర్ జయంతి, అంగన్వాడి కార్యకర్తలు కవిత, పుష్పలత, అఖిల, చంద్ర, ఉమ మరియు సహాయకులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమాలకు
ముఖ్య అతిగా ఇంచార్జ్ తులసినాథ్ పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!