ePaper
Friday, October 9, 2026
📄 ePaper
Homeఆంధ్రప్రదేశ్తిరుపతిడిస్లెక్సియాపై అవగాహన కల్పించాలి

డిస్లెక్సియాపై అవగాహన కల్పించాలి

📰 Generate e-Paper Clip

కార్వేటినగరం అక్టోబర్ 8 (గరుడాదాద్రి న్యూస్): డిస్లెక్సియాపై ప్రజల్లో అవగాహన పెంచేందుకు ప్రపంచ డిస్లెక్సియా అవగాహన దినోత్సవాన్ని గురువారం నిర్వహించారు.ఈ సందర్భంగా మండల విద్యాశాఖ అధికారులు విజయ్ కుమార్ ,మనోజ్ కుమార్ మాట్లాడుతూ డిస్లెక్సియా ఉన్న విద్యార్థులకు చదవడం, రాయడం, పదాలను గుర్తించడంలో ఇబ్బందులు ఎదురవుతాయని నిపుణులు తెలిపారు. ఇలాంటి విద్యార్థులను గుర్తించి, వారికి ప్రత్యేక బోధనతో పాటు అవసరమైన సహకారం అందించాలని సూచించారు. డిస్లెక్సియా మేధస్సు లోపం కాదని, సరైన ప్రోత్సాహంతో విద్యార్థులు తమ ప్రతిభను చాటగలరని పేర్కొన్నారు. బాలికల ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు శేఖర్, ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు మురుగేషన్, చంద్రశేఖర్, డైట్ కాలేజ్ లెక్చరర్ డాక్టర్ హేమలత, ఐ డి ఎస్ ఎస్, ధనంజయులు, సహిత విద్య ఉపాధ్యాయురాలు జి రేఖ, డైట్ కాలేజ్ స్టూడెంట్స్, తల్లిదండ్రులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!