ePaper
Saturday, October 31, 2026
📄 ePaper
Homeఎడిటోరియల్బైరెడ్డిపల్లి మండలంలో పలువురు టి.డి పి కి చెందిన వారు వై.సి.పి లో చేరిక

బైరెడ్డిపల్లి మండలంలో పలువురు టి.డి పి కి చెందిన వారు వై.సి.పి లో చేరిక

📰 Generate e-Paper Clip

బైరెడ్డిపల్లి గరుడదాత్రి అక్టోబర్21

బైరెడ్డిపల్లి మండలం వెంగమవారిపల్లి
పంచాయతీ కడతట్లపల్లి,గ్రామానికి
చెందిన రామచంద్రప్ప తెలుగుదేశం పార్టీ నుండి వై సి.పి లోకి చేరారు.
రామచంద్రప్ప ని వైసీపీలోకిరాష్ట్ర వై.సి పి.కార్యదర్సులు మొగసాల బ్రదర్స్ కృష్ణమూర్తి, రెడెప్ప కండువా కప్పి
ఆహ్వానించినారు.ఈ
కార్యక్రమంలో వెంగమవారిపల్లి వైసిపినాయకులు
కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. అలాగే మండలం లోని నెల్లిపట్ల పంచాయతీ బాపలనత్థం గ్రామంకు చెందిన పలువురు వైసీపీలోకి చేరినారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూమమాజి ముఖ్యమంత్రి జగనన్న సంక్షేమ పథకాలతో ఆకర్షితులై టీడీపీని వీడినట్లు కార్యకర్తలు పేర్కొన్నారు.బాపలనత్తం గ్రామానికి చెందిన మస్తాన్, హాసన్, నూరు, సాధిక, షబ్బీర్, మున్నా తదితరులు టీడీపీని వీడి వైఎస్సార్‌సీపీ తీర్థం పుచ్చుకున్నారు. ఈ సందర్భంగా వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మొగసాల కృష్ణమూర్తి, మాజీఎంపీపీ మొగసాల రెడ్డప్ప, మాజీ వైస్ ఎంపీపీ జైకుమార్‌రెడ్డి వారికి పార్టీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు.
ఈ కార్యక్రమంలో నెల్లిపట్ల గ్రామ పంచాయతీ పరిధికి చెందిన వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!