60 రోజుల ఆదాయం లెక్కింపు.. అన్నదాన హుండీల ద్వారా రూ.83,261
నాగలాపురం, అక్టోబర్ 30 గరుడదాత్రి:
నాగలాపురం మండల పరిధిలోని సురుటుపల్లి శ్రీ పళ్ళికొండేశ్వర స్వామి దేవస్థానానికి హుండీల ద్వారా రూ.6,21,601 ఆదాయం సమకూరింది. గురువారం ఆలయ ప్రాంగణంలో దేవదాయశాఖ రామగిరి గ్రూపు దేవాలయాల కార్యనిర్వహణాధికారి ఎం.హేమచంద్రరావు ఆధ్వర్యంలో హుండీల లెక్కింపు కార్యక్రమం నిర్వహించారు.
ఆలయ చైర్మన్ డి.పద్మనాభరాజు, కార్యనిర్వహణాధికారి పి.లత పర్యవేక్షణలో జరిగిన ఈ లెక్కింపులో ప్రధాన హుండీల ద్వారా రూ.5,38,340 ఆదాయం లభించగా, అన్నదాన హుండీల ద్వారా రూ.83,261 ఆదాయం సమకూరినట్లు అధికారులు వెల్లడించారు.
గత 60 రోజుల కాలానికి సంబంధించిన భక్తుల కానుకల ద్వారా ఈ ఆదాయం వచ్చినట్లు తెలిపారు. హుండీల లెక్కింపు కార్యక్రమంలో నాగలాపురం పోలీస్ స్టేషన్ హెడ్ కానిస్టేబుల్ వి.మగి, పోలీసు సిబ్బంది, ఆలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
