ePaper
Saturday, October 31, 2026
📄 ePaper
Homeఆంధ్రప్రదేశ్తిరుపతినాయుడుపేటలో పోలీసుల తీరుపై వైఎస్సార్‌సీపీ ఆగ్రహం

నాయుడుపేటలో పోలీసుల తీరుపై వైఎస్సార్‌సీపీ ఆగ్రహం

📰 Generate e-Paper Clip

ఎన్నికల వేళ తమ పార్టీ నాయకులను లక్ష్యంగా చేసుకుంటున్నారని ఆరోపణలు

తంబిరెడ్డి మోహన్‌రెడ్డి, బంధువులపై పోలీసుల చర్యలపై అభ్యంతరం

సీఐ వెంకటరమణ వ్యవహారశైలిపై విచారణ జరపాలని డిమాండ్‌

అన్ని పార్టీలకు సమాన న్యాయం, భద్రత కల్పించాలని విజ్ఞప్తి

నాయుడుపేట, అక్టోబర్ 29 గరుడధాత్రి :

నాయుడుపేట మున్సిపాలిటీ ఎన్నికల నేపథ్యంలో పోలీసుల వ్యవహారశైలిపై వైఎస్సార్‌సీపీ నాయకులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఎన్నికల ప్రచార సమయంలో తమ పార్టీ అభ్యర్థులు, నాయకులు, కార్యకర్తలను లక్ష్యంగా చేసుకుని పోలీసులు వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. పోలీసుల చర్యలు పక్షపాత ధోరణిని తలపిస్తున్నాయని అభ్యంతరం వ్యక్తం చేశారు.
ముఖ్యంగా వైఎస్సార్‌సీపీ చైర్‌పర్సన్‌ అభ్యర్థి తంబిరెడ్డి రాజేశ్వరమ్మ కుమారుడు తంబిరెడ్డి మోహన్‌రెడ్డితో పాటు వారి బంధువులు, పార్టీ నాయకులను పోలీస్‌స్టేషన్‌కు పిలిపించి ఇబ్బందులకు గురిచేస్తున్నారని పేర్కొన్నారు. కొందరిపై అరెస్టులు, కేసుల పేరుతో ఒత్తిడి తీసుకొస్తున్నారని ఆరోపించారు. ఈ వ్యవహారంలో సీఐ వెంకటరమణ పాత్రపైనా పలు సందేహాలు వ్యక్తం చేశారు.
పోలీసు శాఖ రాజకీయాలకు అతీతంగా వ్యవహరించాలని, చట్టం ముందు అన్ని రాజకీయ పార్టీలూ సమానమేనని వైఎస్సార్‌సీపీ నాయకులు స్పష్టం చేశారు. ఎన్నికలు స్వేచ్ఛాయుతంగా, ప్రశాంత వాతావరణంలో జరిగేలా చూడాల్సిన బాధ్యత పోలీసులపై ఉందన్నారు. ఏ ఒక్క రాజకీయ పార్టీకి అనుకూలంగా పోలీసు వ్యవస్థ పనిచేస్తుందనే భావన ప్రజల్లో కలగకూడదని పేర్కొన్నారు.
తమ పార్టీ నాయకులు, అభ్యర్థులపై జరుగుతున్న పోలీసు చర్యలపై జిల్లా పోలీసు ఉన్నతాధికారులు సమగ్ర విచారణ చేపట్టాలని డిమాండ్‌ చేశారు. అక్రమ నిర్బంధాలు, బెదిరింపులు, దాడులకు సంబంధించిన ఫిర్యాదులను నిష్పక్షపాతంగా పరిశీలించాలని కోరారు. సీఐ వెంకటరమణ వ్యవహారశైలిపైనా విచారణ జరిపించాలని విజ్ఞప్తి చేశారు.
ఎన్నికల సమయంలో అన్ని రాజకీయ పార్టీలకు సమాన న్యాయం, భద్రత కల్పించాలని, ప్రజాస్వామ్య హక్కులకు భంగం కలగకుండా పోలీసులు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని వైఎస్సార్‌సీపీ నాయకులు కోరారు.

RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!