బహిరంగ సభలో చిత్తూరు ఎంపీ దగ్గుమళ్ళ ప్రసాదరావు , ఎమ్మెల్యే గురుజాల జగన్మోహన్ పిలుపు
చిత్తూరు అక్టోబర్29(గరుడ దాత్రి న్యూస్)చిత్తూరు నగర కార్పొరేషన్ అభివృద్ధి కూటమి అభ్యర్థుల గెలుపుతోనే సాధ్యమని చిత్తూరు పార్లమెంటు సభ్యులు దగ్గుమళ్ళ ప్రసాదరావు, చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్, కూటమి ముఖ్య నాయకులు తెలిపారుగురువారం చిత్తూరు నగర కార్పొరేషన్ ఎన్నికల ప్రచారం చివరి దశకు చేరుకున్న నేపథ్యంలో, జిల్లా కేంద్రమైన చిత్తూరు నడిబొడ్డున ఉన్న గాంధీ విగ్రహం కూడలిలో కూటమి ఆధ్వర్యంలో భారీ ఎన్నికల ప్రచార బహిరంగ సభఅత్యంతఉత్సాహభరిత వాతావరణంలో జరిగింది.ఈ సభకు నగర ప్రజలు, కూటమి నాయకులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో తరలివచ్చారు.ఈ బహిరంగ సభలో చిత్తూరు ఎంపీ దగ్గుమళ్ళ ప్రసాదరావు, చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్, కూటమి బలపరిచిన మేయర్ అభ్యర్థి కటారి హేమలత, మాజీ ఎమ్మెల్సీ దొరబాబు, జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు షణ్ముగ రెడ్డి, సునీల్ చౌదరి, మాజీ ఎమ్మెల్యే కె.ఎస్. మనోహర్, మాజీ జిల్లా అధ్యక్షుడు సి ఆర్ రాజన్, టీడీపి సీనియర్ నేతలు చంద్రప్రకాష్, సురేంద్ర కుమార్, కాజూరు బాలాజీ, కార్పొరేటర్ అభ్యర్థులు మరియు కూటమి ముఖ్య నేతలు పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఎంపీ దగ్గుమళ్ళ ప్రసాదరావు, ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్నాయకులుమాట్లాడుతూ జిల్లా కేంద్రమైన చిత్తూరు నగర కార్పొరేషన్ సమగ్ర అభివృద్ధి కేవలం కూటమి బలపరిచిన మేయర్ అభ్యర్థి కటారి హేమలత గెలుపుతోనే సాధ్యమవుతుందని స్పష్టం చేశారు.నగరంలో మౌలిక వసతుల కల్పన, సంక్షేమం, ప్రగతి పథంలో ముందుకు తీసుకెళ్లడమే కూటమి ధ్యేయమని వారు పేర్కొన్నారు.ప్రజలందరూ ఈ వాస్తవాన్ని గమనించి, నగర భవిష్యత్తును, అభివృద్ధిని కాంక్షించి కూటమి అభ్యర్థులను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని స్థానిక ఓటర్లను, ప్రజలను వారు ఈసందర్భంగాఅభ్యర్థించారు. రాబోయే ఎన్నికల్లో కూటమి విజయకేతనం ఎగరేయడం ఖాయమని వారు ధీమా వ్యక్తం చేశారు.ఈ కార్యక్రమంలో కూటమి కార్పొరేటర్ అభ్యర్థులు, నియోజకవర్గ నాయకులు, జనసేన, బీజేపీ, టీడీపీ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు…
