* కుప్పం టిడిపి ఇన్చార్జ్ పి.ఎస్. మునిరత్నం పిలుపు.
చిత్తూరు బ్యూరో,కుప్పం అక్టోబర్ 31(గరుడ ధాత్రి న్యూస్): తెలుగుదేశం పార్టీ అభ్యర్థుల విజయానికి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు కృషి చేయాలని కుప్పం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్, ఏపీఎస్ఆర్టీసీ వైస్ చైర్మన్ పి.ఎస్. మునిరత్నం పిలుపునిచ్చారు. శనివారం కుప్పం మున్సిపల్ పరిధిలోని 27వ వార్డులో తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులతో ఆయన మాట్లాడారు. ఆదివారం జరగనున్న ఎన్నికలకు సంబంధించి 100 శాతం పోలింగ్ నమోదయ్యేలా కృషి చేయాలని కోరారు. ఎన్నికలలో ఏ వార్డులో అత్యధిక మెజార్టీ వస్తుందో అవార్డు అభివృద్ధిపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రత్యేక దృష్టి సారిస్తారన్నారు. 27వ వార్డులో ప్రచారం చేసిన అందరిని అభినందించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నాయకత్వంలో రాష్ట్రంలో అమలవుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని విజ్ఞప్తి చేశారు. ఎన్నికల్లో మున్సిపల్ చైర్మన్ అభ్యర్థితో పాటు కౌన్సిలర్ అభ్యర్థిని అత్యధిక మెజారిటీతో గెలిపించేలా సమన్వయంతో కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో 27వ వార్డు కౌన్సిలర్ అభ్యర్థి శ్యామ్ సుందర్, యూనిట్ ఇంచార్జ్ ఆర్ ఆర్ రవి ,కుప్పం మున్సిపల్ తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షులు ఆర్. శ్రీనివాసులు, టిడిపి నాయకులు అజిత్ ,సాగర్, విష్ణు, టౌన్ బ్యాంక్ చైర్మన్ మంజునాథ్ తదితరులు పాల్గొన్నారు.
