ePaper
Tuesday, November 3, 2026
📄 ePaper
Homeఆంధ్రప్రదేశ్తిరుపతిచిత్తూరు నగరంలో పోలింగ్ కేంద్రాలను పరిశీలించిన ఎంపీ దగ్గుమళ్ళ ప్రసాదరావు,మాజీ ఎమ్మెల్యే ఏఎస్ మనోహర్

చిత్తూరు నగరంలో పోలింగ్ కేంద్రాలను పరిశీలించిన ఎంపీ దగ్గుమళ్ళ ప్రసాదరావు,మాజీ ఎమ్మెల్యే ఏఎస్ మనోహర్

📰 Generate e-Paper Clip

ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు వజ్రాయుధం లాంటిది–ఎంపీ దగ్గుమళ్ళ

చిత్తూరు, నవంబర్ 01(గరుడధాత్రిన్యూస్)చిత్తూరు నగరంలో జరుగుతున్న మున్సిపల్ ఎన్నికల పోలింగ్ ప్రక్రియను ఆదివారం కూటమి నాయకులు క్షేత్రస్థాయిలో పరిశీలించారు. చిత్తూరు పార్లమెంట్ సభ్యులు, పొలిట్ బ్యూరో సభ్యులు దగ్గుమళ్ళ ప్రసాదరావు , మాజీ ఎమ్మెల్యే ఏఎస్ మనోహర్ తో కలిసి నగరంలోని పలు డివిజన్లలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాలను సందర్శించారు.ఈ సందర్భంగా వారు పోలింగ్ సరళినిఅడిగితెలుసుకున్నారు. ఓటర్లు ప్రశాంత వాతావరణంలో ఓటు వేసేందుకు కల్పించిన వసతులను, భద్రతా ఏర్పాట్లను పరిశీలించారు.
పోలింగ్ కేంద్రాల వద్ద బారులు తీరిన ఓటర్లతో ఎంపీ ముచ్చటించారు.
ఈ సందర్భంగా ఎంపీ దగ్గుమళ్ళ ప్రసాదరావు గారు మాట్లాడుతూ:
“ప్రజాస్వామ్యంలో వజ్రాయుధం లాంటిది ఓటు హక్కు. నగర భవిష్యత్తును, అభివృద్ధిని నిర్ణయించే ఈ మున్సిపల్ ఎన్నికల్లో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి. ఓటర్లు తమ అమూల్యమైన ఓటు హక్కును బాధ్యతగా సద్వినియోగం చేసుకోవాలి” అని స్థానిక ప్రజలకు విజ్ఞప్తి చేశారు.కూటమి అభ్యర్థుల విజయానికి నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో పనిచేస్తున్నారని ఆయన పేర్కొన్నారు.ఈకార్యక్రమంలో కూటమి కార్పొరేటర్ అభ్యర్థులు, కూటమి ముఖ్య నాయకులు పెద్ద సంఖ్యలో కార్యకర్తలు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!