గుడిపాల మండలంలో ఎమ్మెల్యే గురజాల జగన్ మోహన్ ఎన్నికల ప్రచారం
చిత్తూరు నవంబర్ 2 (గరుడదాత్రిన్యూస్)అభివృద్ధిచేసేకూటమిప్రభుత్వానికి, కూటమి పార్టీల అభ్యర్థులకు ఓటు వేసి గెలిపించాలని ఎమ్మెల్యే గురజాల జగన్ మోహన్ పిలుపునిచ్చారు. ఎంపీటీసీ, జడ్పిటీసీ ఎన్నికల్లో భాగంగా సోమవారంగుడిపాల మండలంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. 197 రామాపురం, కమ్మ తిమ్మాపల్లి గ్రామ పంచాయతీల పరిధిలోని గ్రామాల్లో స్థానిక నాయకులతో కలిసి పర్యటించారు. రెండేళ్లలో చేపట్టిన అభివృద్ధి పనులను వివరిస్తూ, కరపత్రాలు పంచుతూ కూటమి పార్టీల ఎంపీటీసీ, జడ్పిటీసీ అభ్యర్థులకు ఓటు వేసి గెలిపించాలని కోరారు. మండలంలోని కుప్పిగానిపల్లి, మరకాల కుప్పం తదితర పంచాయతీల పరిధిలో స్థానిక నాయకులు, అభ్యర్థులు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. కార్యక్రమంలో జడ్పీటీసీ అభ్యర్థి మమత.ఈశ్వర నాయుడు, చుడా చైర్ పర్సన్ కఠారి హేమలత, సీకే లావణ్య, కాజూరు బాలాజీ, మండలం తెదేపా అధ్యక్షుడుసుబ్బానాయుడు, స్థానిక కూటమి నాయకులు పాల్గొన్నారు.
