ePaper
Friday, June 19, 2026
📄 ePaper
Homeఆంధ్రప్రదేశ్ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికకు

ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికకు

📰 Generate e-Paper Clip

నగరపాలక సంస్థకు 27 వినతులు.

ఇంచార్జి కమిషనర్ శారదా దేవి

నగరపాలక సంస్థ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికకు 27 వినతులు వచ్చాయని ఇంచార్జి కమిషనర్ శారదా దేవి తెలిపారు. సోమవారం తిరుపతి నగరపాలక సంస్థ కార్యాలయంలో డయల్ యువర్ కమిషనర్, ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమాలను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కార్యాలయంకు నేరుగా వచ్చి 23మంది వినతులు సమర్పించగా, 4 మంది ఫోన్ ద్వారా తమ సమస్యలు తెలిపారు. కాగా తెలుగుగంగ నీరు సక్రమంగా పంపిణీ చేయాలని, లీలా మహల్ కూడలి వద్ద కాలువ కోసం తవ్వారు శుభ్రం చేయాలని, గొల్లవాణిగుంటలో ఆక్రమనలను అపాలని, కోర్లగుంట శుభాష్ నగర్లో అక్రమ నిర్మాణాలు అడ్డుకోవాలని, లీలామహల్ సమీపంలో ఆక్రమణకు గురైన స్థలాన్ని పరిష్కరించాలని, అన్నమయ్య హోటల్ వలన ఇబ్బందిగా ఉంది పరిసగకరించాలని, దోమలు ఎక్కువగా ఉన్నాయని, బిపిఎస్, ఎల్ ఆర్ ఎస్ దరఖాస్తులు పరిష్కరించాలని కోరారు. ఆయా విభాగాల అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించి పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ కమిషనర్ అమరయ్య, సూపరింటెండెంట్ ఇంజనీర్ శ్యాంసుందర్, మునిసిపల్ ఇంజినీర్లు తులసి కుమార్, గోమతి, హెల్త్ ఆఫీసర్ డాక్టర్ యువ అన్వేష్, డిసిపీ ఖాన్, రెవిన్యూ అధికారులు సేతుమాదవ్, రవి, ఉద్యానవన శాఖాధికారి హరికృష్ణ, వెటర్నరీ ఆఫీసర్ గుణశేఖర్, డి.ఈ.లు, ఏసీపీ లు, శానిటరీ సూపర్ వైజర్లు, తదితరులు ఉన్నారు.

RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!