ePaper
Monday, June 22, 2026
📄 ePaper
Homeఆంధ్రప్రదేశ్తిరుపతిసీఎం విజయ్... ప్రతిపక్ష నేత ఉదయనిధి స్టాలిన్

సీఎం విజయ్… ప్రతిపక్ష నేత ఉదయనిధి స్టాలిన్

📰 Generate e-Paper Clip

తమిళనాడులో కొత్త నాయకులు రాబోతున్నారు. ఎన్నికల తరువాత రాజకీయ తెర మీద నేతలు కూడా మారిపోయారు. అయిదేళ్ళ క్రితం వరకూ చూస్తే సీఎం గా స్టాలిన్ ఉంటే ప్రధాన ప్రతిపక్ష నేతగా మాజీ సీఎం పళని స్వామి వ్యవహరించారు. ఈసారి ఆ చాన్స్ పళనిస్వామికి లేకుండా పోయింది. ఆయన నాయకత్వంలోని అన్నా డీఎంకే కూటమికి 51 సీట్లు మాత్రమే దక్కాయి. అదే సమయంలో డీఎంకేకు 74 సీట్లు వచ్చాయి. దాంతో ప్రధాన ప్రతిపక్ష హోదా డీఎంకేకు దక్కనుంది.
ఇక డీఎంకే అధినేత ముఖ్యమంత్రిగా ఈ రోజు దాకా వ్యవహరించిన ఎంకే స్టాలిన్ ఓటమి పాలు కావడంతో ఆయన కుమారుడిదే ఇక అసెంబ్లీలో ప్రతిపక్ష బాధ్యత అని అంటున్నారు. ఉదయనిధి స్టాలిన్ చెపాక్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి మరోసారి గెలిచారు. ఆయన మీద పోటీ చేసిన టీవీకే అభ్యర్థి డీ సెల్వం మీద తక్కువ మెజారిటీతోనే ఉదయనిధి గెలిచారు. దాంతో తమిళనాడు అసెంబ్లీలో ఆయనే కొత్త ప్రతిపక్ష నాయకుడు అవుతారు. ఆయన గడచిన రెండేళ్ళుగా ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఇపుడు విపక్ష నేత హోదాలోకి మారబోతున్నారు.
ఇక విషయానికి వస్తే సీఎం కాబోతున్న విజయ్ అలాగే ప్రతిపక్ష నేత ఉదయనిధి ఇద్దరూ యువకులే. ఆయన విజయ్ కంటే మూడేళ్ళు చిన్నవారు. ప్రస్తుతం 49 ఏళ్ల వయసు. ఇక ఉదయనిధి స్టాలిన్ కూడా సినిమాల్లో హీరోగా నటించారు. అలాగే నిర్మాతగా డిస్ట్రిబ్యూటర్ గా ఆయన కీలక పాత్ర పోషించారు. అంతే కాదు ఆయన రెడ్ జైంట్ మూవీస్ పతాకంపై 2008 లో విజయ్ త్రిష హీరోహీరోయిన్లుగా కురువి పేరుతో ఒక చిత్రం నిర్మించి నిర్మాతగా సినీ రంగంలోకి తొలిసారి అడుగు పెట్టారు. అలా విజయ్ తో ఆయనకు రెండు దశాబ్దాల క్రితమే పరిచయం ఉంది అలాగే ఆయన 2012లో ఓరు కల్ ఓరు కన్నడి సినిమా ద్వారా హీరోగా అరంగేట్రం తమిళంలో చేశారు
తమిళనాడులో ఏడు పదుల వయసు గల రాజకీయ నేతలను కీలక స్థానాలలో ఇంతకాలం అంతా చూశారు. తొలిసారి 50 ఏళ్ల వయసున్న రాజకీయ నేతల నవ తరం రాజకీయం చూడబోతున్నారు. విజయ్ కి సీఎం గా కొత్త. అలాగే విపక్ష నేత హోదా ఉదయ నిధి స్టాలిన్ కి మరీ కొత్త. అయితే ఉదయ నిధిని రాజకీయంగా కొంత అనుభవం ఉంది. పైగా ఉప ముఖ్యమంత్రిగా పనిచేశారు. దాంతో ఆయన 74 మంది సభ్యుల డీఎంకే కూటమిని నాయకత్వం వహించడం భవిష్యత్తు రాజకీయాలకు బాటలు వేసుకున్నట్లుగానే లెక్క అని అంటున్నారు. ఈ సందర్బంగా తనను తాను లీడర్ గా నిరూపించుకోగలిగితే 2031 కి స్టాలిన్ అప్పటికే ఆయన వయసు 80 సంవత్సరాలకు చేరుతుంది కనుక రిటైర్మెంట్ తీసుకుని ఉదయనిధిని ముఖ్యమంత్రిగా చూడొచ్చు

RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!