బాలికలలో ఆత్మవిశ్వాసం పెంపొందించడానికే ప్రభుత్వం కిషోరి వికాసం కార్యక్రమాన్ని అమలు చేస్తున్నట్టు పిచ్చాటూరు ఐసిడిఎస్ సూపర్వైజర్స్ బాజావతి,సుమతి చెప్పారు.శుక్రవారం ఇచ్చాటూరు మండలం మరియు వాటి పరిధిలో ఉన్న అంగన్వాడీ కేంద్రంలో కిషోర్ వికాసంపై కౌమార బాలికలకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు.ఈ సందర్భంగా సూపర్వైజర్స్ మాట్లాడుతూ బాలికలకు వ్యక్తిగత పరిశుభ్రత ముఖ్యమన్నారు. ఇందులో భాగంగానే మే ఒకటో తేదీ నుంచి 11వ తేదీ వరకు కిషోరి వికాసంపై ప్రతి మంగళ,శుక్రవారాల్లో ఆయా అంగన్వాడి కేంద్రాల్లో కౌమార బాలికలకు అవగాహన కార్యక్రమాలు జరుగుతుందన్నారు. కౌమార దశలో బాలికలు రక్తహీనతకు గురి కాకుండా పౌష్టికాహారం తీసుకోవాలన్నారు.దీనివల్ల ఆరోగ్యం కూడా కాపాడుకోవచ్చునన్నారు.ప్రస్తుతం మహిళపై లైంగిక దాడులు వేధింపులు అధికమవుతున్న నేపథ్యంలో మానసిక స్థైర్యంతో ముందుకు వెళ్లాలన్నారు.ఇందుకోసం బాలికలు ఉన్నత చదువులు చదువుకోవాల్సిన అవసరం ఉందన్నారు. తద్వారా మహిళలకు ఉన్న హక్కులు,చట్టాలపై అవగాహన ఏర్పడుతుందన్నారు.చదువుతోపాటు నైపుణ అభివృద్ధి పెంచుకోవాలన్నారు.ప్రధానంగా బాలికల సగటు వివాహ వయస్సును పెంచడం,లింగ సమానత్వం తీసుకురావడంతో పాటు వారి భవిష్యత్తును ఉజ్వలంగా తీర్చిదిద్దడమే ఈ కార్యక్రమం యొక్క ఉద్దేశం అన్నారు.అనంతరం ఆరోగ్యం,పోషకహారం,ఋతుపారిశుభ్రత,పోస్కో యాక్ట్, బాల్యవివాహాలు,డ్రగ్స్,స్కిల్స్,సైబర్ నేరాలు తదితర అంశాలపై సూపర్వైజర్స్ వివరించారు.ఈ కార్యక్రమంలో అంగన్వాడీ టీచర్స్ జ్యోతి, రూత్ మేరీ,కిషోరి బాలబాలికలు, గ్రామస్తులు తల్లిదండ్రులు పాల్గొన్నారు.
