-టీడీపీ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి నారా లోకేశ్ నేతృత్వంలో 10 మందితో సమన్వయ కమిటీ ఏర్పాటు
-“మహానాడు” నిర్వహణకు 19 కమిటీలు
-సమన్వయ కమిటీ కన్వీనర్‌గా మంత్రి నారా లోకేశ్
-పలు కమిటీల్లో భాగస్వాములుగా ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాల పార్టీ నేతలు
-యనమల రామకృష్ణుడి నేతృత్వంలో తీర్మానాల కమిటీ
– పయ్యావుల కేశవ్ కన్వీనర్‌గా సభా నిర్వహణ కమిటీ
-మహానాడు కు 5 లక్షల మంది హాజరు – అందుకు తగిన విధంగా ఏర్పాట్లు
✍️
మహానాడు నిర్వహణకు తెలుగుదేశం పార్టీ 19 కమిటీలను ఏర్పాటు చేసింది. సీనియర్లు, జూనియర్ల కలయికతో కమిటీ ఏర్పాటు చేశారు. ఈనెల 27, 28,29 తేదీల్లో నెల్లూరు జిల్లాలోని ఇఫ్కో సెజ్ ప్రాంగణంలో మహానాడు నిర్వహించనున్నారు. దీని కోసం సమన్వయ కమిటీ ఏర్పాటు చేశారు.
“మహానాడు” నిర్వహణకు టీడీపీ అధిష్ఠానం 19 కమిటీలను ఏర్పాటు వేసింది. ఈ క్రమంలో టీడీపీ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి నారా లోకేశ్ నేతృత్వంలో 10 మందితో సమన్వయ కమిటీ ఏర్పాటు చేశారు. ఈ కమిటీకి కో కన్వీనర్‌గా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావులను నియమించింది. మంత్రి గొట్టిపాటి రవికుమార్ నేతృత్వంలో జనసమీకరణ కమిటీ ఏర్పాటు అయ్యింది.
మంత్రులు ఎన్‌ఎండీ ఫరూఖ్, అనగాని సత్యప్రసాద్, బీసీ జనార్థన్‌రెడ్డి, కింజరాపు అచ్చెన్నాయుడు, ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి కిలారు రాజేష్, ఎమ్మెల్సీ బీద రవిచంద్రయాదవ్, పార్టీ జోనల్ కోఆర్డినేటర్ మంతెన సత్యనారాయణరాజులు కమిటీలో సభ్యులుగా ఉన్నారు. పలు కమిటీల్లో ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాల పార్టీ నేతలను భాగస్వాముల్ని చేశారు.
యనమల అధ్యక్షతన తీర్మానాల కమిటీ: తెలుగుదేశం పొలిట్ బ్యూరో సభ్యుడు యనమల రామకృష్ణుడి నేతృత్వంలో తీర్మానాల కమిటీ ఏర్పాటు చేశారు. కోకన్వీనర్లుగా ఎమ్మెల్యేలు సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి, కాలవ శ్రీనివాసులు, పార్టీ నాలెడ్జ్ కమిటీ ఛైర్మన్ గురజాల మాల్యాద్రి, మంత్రి సవిత, పొలిట్‌బ్యూరో సభ్యులు నక్కా ఆనంద్‌బాబు, ఎంఏ షరీఫ్, వర్ల రామయ్య, ఎమ్మెల్యేలు కళా వెంకట్రావు, కూన రవికుమార్, ఎమ్మెల్సీ పంచుమర్తి అనురాధ, మాజీ ఎమ్మెల్సీ పి.అశోక్‌బాబు, ఏపీ కాలుష్య నియంత్రణ మండలి ఛైర్మన్ పి.కృష్ణయ్య, జీవవైవిధ్య బోర్డు ఛైర్మన్ నీలాయపాలెం విజయ్ కుమార్, నేతలు చిలువేరు కాశీనాథ్, సామా భూపాల్‌రెడ్డి, నెల్లూరి దుర్గాప్రసాద్‌లను సభ్యులుగా నియమించారు.
ఆహ్వాన కమిటీలో ఆ రాష్ట్రాల నేతలు: టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు, పొలిట్‌బ్యూరో సభ్యుడు బక్కని నరసింహులు (తెలంగాణ), అండమాన్-నికోబార్ అధ్యక్షుడు మాణిక్యం యాదవ్‌లు కన్వీనర్లుగా ఆహ్వాన కమిటీని నియమించారు. పయ్యావుల కేశవ్ కన్వీనర్‌గా సభా నిర్వహణ కమిటీ ఏర్పాటు చేశారు. కేంద్రమంత్రి రామ్మోహన్‌నాయుడు పలువులు నేతలు ఇందులో సభ్యులుగా ఉన్నారు.
మంత్రులను కమిటీలకు కన్వీనర్లుగా నియమించారు. మంత్రి అచ్చెన్నాయుడు కన్వీనర్‌గా వసతి ఏర్పాట్ల కమిటీ, బీసీ జనార్థన్‌రెడ్డి కన్వీనర్‌గా భోజనాల ఏర్పాట్ల కమిటీ, హోంమంత్రి వంగలపూడి అనిత కన్వీనర్‌గా మీడియా కమిటీ, రెవెన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్ కన్వీనర్‌గా ఆర్థిక వ్యవహారాల కమిటీ, గుమ్మిడి సంధ్యారాణి కన్వీనర్‌గా సాంస్కృతిక కార్యక్రమాల కమిటీ, నిమ్మల రామానాయుడు కన్వీనర్‌గా సభా ప్రాంగణ పర్యవేక్షణ కమిటీలు ఏర్పాటు చేశారు. వీటితో పాటు చిత్ర ప్రదర్శన, ప్రతినిధుల నమోదు, అలంకరణ, రవాణా, వాహన పార్కింగ్, రక్తదానం-వైద్య క్యాంపు, వాలంటీర్ల నిర్వహణ, జనసమీకరణ, పరిశుభ్రత-సుందరీకరణకు కమిటీలను ఏర్పాటు చేశారు.
