ePaper
Sunday, June 21, 2026
📄 ePaper
Homeఆంధ్రప్రదేశ్తిరుపతిపేద ప్రజల సంక్షేమమే చంద్రబాబు ప్రభుత్వ లక్ష్యం

పేద ప్రజల సంక్షేమమే చంద్రబాబు ప్రభుత్వ లక్ష్యం

📰 Generate e-Paper Clip

పేద ప్రజల సంక్షేమమే చంద్రబాబు ప్రభుత్వ లక్ష్యం

– ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి రూ. 8 లక్షల చెక్కును అందజేసిన కురపాటి శంకర్ రెడ్డి

ప్రజలకు అందుబాటులో ఉంటూ బాధిత కుటుంబాలను ఆదుకోవడమే టిడిపి ప్రభుత్వం లక్ష్యమని సత్యవేడు టిడిపి ప్రోగ్రాం కోఆర్డినేటర్ కూరపాటి శంకర్ రెడ్డి అన్నారు. తిరుపతిలో శనివారం మండల కేంద్రమైన నారాయణవనంలోని పట్టు శాలి వీధికి చెందిన బత్తల నాగరాజుకు ఆపరేషన్ నిమిత్తం ముఖ్యమంత్రి సహాయనిధి నుండి 8 లక్ష రూపాయలు చెక్కును మండల టిడిపి అధ్యక్షులు పీ గిరిబాబు ఆధ్వర్యంలో టిడిపి పార్టీ ప్రోగ్రాం కోఆర్డినేటర్ కూరపాటి శంకర్ రెడ్డి అందజేశారు.ఈ సందర్భంగా కురపాటి శంకర్ రెడ్డి మాట్లాడుతూ, ప్రజల సంక్షేమమే ధ్యేయంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తోందని, కష్టాల్లో ఉన్న ప్రతి కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందని, ముఖ్యమంత్రి అందిస్తున్న ఈ సాయం బాధిత కుటుంబాలకు కొండంత అండనిస్తుందని పేర్కొన్నారు. చంద్రబాబు నాయకత్వంలో సత్యవేడు నియోజవర్గాన్ని అభివృద్ధి బాటలో నడిపిస్తూ సంక్షేమ పథకాలను ప్రజలందరికీ అందించడమే లక్ష్యంగా పని చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో టిడిపి మండల అధ్యక్షులు పి గిరి బాబు, మండల ప్రధాన కార్యదర్శి, మార్కెటింగ్ కమిటీ డైరెక్టర్ కుమార్, టౌన్ టిడిపి పార్టీ ప్రెసిడెంట్ కంద స్వామి మొదలియార్, యూనిట్ ఇన్చార్జి బాబు, బూత్ ఇన్చార్జీలు లక్ష్మణ్, లోకయ్య మండల టిడిపి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!