ఉపాధి హామీ పనుల్లో మహిళకు పాము కాటు
నాగలాపురం మండలంలో ఉపాధి హామీ పనులకు వెళ్లిన ఓ మహిళను పాము కాటేసిన ఘటన బుధవారం ఉదయం చోటుచేసుకుంది.
నాగలాపురం నటరాజకుంటకు చెందిన ప్రేమ నాగలాపురం పరిధిలోని అటవీ ప్రాంతంలో ఉపాధి హామీ పనుల్లో పాల్గొంటుండగా అకస్మాత్తుగా ఓ పాము కాటేసింది. దీంతో సహచర కార్మికులు వెంటనే ఆమెను నాగలాపురం ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు. అక్కడ ప్రాథమిక చికిత్స అందించిన వైద్యులు పరిస్థితిని గమనించి మెరుగైన చికిత్స కోసం నగరి ఏరియా ఆసుపత్రికి రిఫర్ చేశారు.
అలాగే ఆమెను రెండు రోజుల పాటు వైద్యుల పర్యవేక్షణలో ఉంచాలని డాక్టర్లు సూచించినట్లు సమాచారం. ప్రస్తుతం ఆమె ఆరోగ్య పరిస్థితిపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
