ePaper
Friday, June 19, 2026
📄 ePaper
Homeఆంధ్రప్రదేశ్తిరుపతిసమస్యలు ఉన్నాయా..? వెంటనే కాల్ చేయండి 📞 సత్యవేడు సదవాలమ్మ జాతరకు ప్రత్యేక హెల్ప్‌లైన్ నంబర్లు...

సమస్యలు ఉన్నాయా..? వెంటనే కాల్ చేయండి 📞 సత్యవేడు సదవాలమ్మ జాతరకు ప్రత్యేక హెల్ప్‌లైన్ నంబర్లు విడుదల

📰 Generate e-Paper Clip

సమస్యలు ఉన్నాయా..? వెంటనే కాల్ చేయండి 📞
సత్యవేడు సదవాలమ్మ జాతరకు ప్రత్యేక హెల్ప్‌లైన్ నంబర్లు విడుదల

నియోజకవర్గ కేంద్రమైన సత్యవేడులో బుధవారం రాత్రి నుంచి ప్రారంభమయ్యే సదవాలమ్మ జాతర వేడుకలకు అధికారులు భారీ ఎత్తున ఏర్పాట్లు పూర్తి చేస్తున్నారు. రెండు రోజుల పాటు అంగరంగ వైభవంగా జరిగే ఈ జాతరకు వేలాదిగా భక్తులు తరలివచ్చే అవకాశం ఉండటంతో అన్ని శాఖలు సమన్వయంతో పనిచేస్తున్నాయి.
జాతరలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పోలీసులు ప్రత్యేక బందోబస్తు ఏర్పాటు చేశారు. స్థానిక పోలీసు సిబ్బందితో పాటు శ్రీ సిటీ నుంచి అదనపు సెక్యూరిటీ బలగాలను కూడా వినియోగంలోకి తీసుకొచ్చారు. ట్రాఫిక్ నియంత్రణ, క్యూలైన్ల నిర్వహణ, భక్తుల రద్దీ నియంత్రణపై ప్రత్యేక దృష్టి సారించారు.
గంగమ్మను కొలువులో ఉంచే గంగమిట్ట ప్రాంతంలో నిరంతర ఆరోగ్య సేవల కోసం వైద్య సిబ్బందిని అందుబాటులో ఉంచినట్లు అధికారులు తెలిపారు. అలాగే మంచినీరు, పారిశుద్ధ్యం, వీధి దీపాలు, విద్యుత్ సరఫరా వంటి మౌలిక వసతులపై ప్రత్యేక చర్యలు చేపట్టారు.
జాతర సందర్భంగా భక్తులు, స్థానికులు, పట్టణ ప్రజలకు ఏవైనా సమస్యలు ఎదురైతే వెంటనే స్పందించేందుకు ప్రత్యేక సెల్ నెంబర్లను విడుదల చేశారు.

సమస్యల వారీగా సంప్రదించాల్సిన నెంబర్లు ఇవే: 👇

🔹 మంచినీరు, పారిశుద్ధ్యం, వీధి దీపాలు
📞 8555806989

🔹 బందోబస్తు, ట్రాఫిక్, క్యూలైన్ సమస్యలు
📞 9440796767 (SI)
📞 9440796766 (CI)

🔹 విద్యుత్ సరఫరా సమస్యలు
📞 9440811817
📞 9786129474

🔹 జాతర నిర్వహణ ఏర్పాట్లు
📞 7981020399

భక్తులు సహకరించి జాతరను విజయవంతం చేయాలని అధికారులు కోరారు.

RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!