ePaper
Friday, June 19, 2026
📄 ePaper
Homeఆంధ్రప్రదేశ్తిరుపతితిరుపతి ని అర్బన్ మోడల్ సిటీ గా అభివృద్ధి చేయడమే లక్ష్యం..

తిరుపతి ని అర్బన్ మోడల్ సిటీ గా అభివృద్ధి చేయడమే లక్ష్యం..

📰 Generate e-Paper Clip

తిరుపతి ని అర్బన్ మోడల్ సిటీ గా అభివృద్ధి చేయడమే లక్ష్యం..
టిడిపి రాష్ట్ర నేత డాక్టర్ ‘కోడూరు’ చేపట్టిన ప్రయత్నాలకు ప్రభుత్వం సానుకూలం…
నగర అభివృద్ధిపై మంత్రి లోకేష్, సీఎమ్ఓ అధికారుల సానుకూలం..

గరుడధాత్రి :
తిరుపతి ని ఆధ్యాత్మిక నగరంతో పాటు ఐటీ హబ్, మోడల్ అర్బన్ సిటీగా అభివృద్ధి చేయాలన్నదే తన లక్ష్యమని టిడిపి రాష్ట్ర మాజీ అధికార ప్రతినిధి డాక్టర్ కోడూరు బాలసుబ్రమణ్యం చెప్పారు. గత మూడు రోజులుగా అమరావతిలో టిడిపి జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్, ముఖ్యమంత్రి కార్యాలయ కార్యదర్శి ప్రద్యుమ్న,ఇతర అధికారులతో డాక్టర్ కోడూరు బాలసుబ్రమణ్యం పలుమార్లు కలసి తిరుపతి ని మోడల్ సిటీ తో పాటు ఐటీ హబ్ గా తీర్చిదిద్దే విధంగా సుదీర్ఘంగా చర్చించారు. అందుకు మంత్రి నారా లోకేష్ తో పాటు సీఎంఓ అధికారులు కూడా సుముఖత వ్యక్తం చేశారని చెప్పారు. ఈ నేపథ్యంలో శుక్రవారం విజయవాడలోని ముఖ్యమంత్రి కార్యదర్శి ప్రద్యుమ్న ను డాక్టర్ కోడూరు బాలసుబ్రమణ్యం తో పాటు రాష్ట్ర నేతలు పుష్పావతి యాదవ్, కృష్ణ యాదవ్ కలిసి తిరుపతి నగరంలో ప్రధానంగా ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం, అభివృద్ధికి చెప్పడాల్సిన పనులపై సుదీర్ఘంగా ప్రద్యుమ్నతో డాక్టర్ కోడూరు బాలసుబ్రమణ్యం చర్చించారు.

ప్రతిపాదించిన ప్రధాన అంశాలు ఇవే….
… తిరుపతిని స్పీరుచువల్ క్యాపిటల్, ఐటి ఇన్నోవేషన్ హబ్, క్లీనెస్ట్ పిలిగ్రీమ్ సిటీగా అభివృద్ధి చేయడం..
… నగరంలో రోజురోజుకు పెరుగుతున్న జనాభా నేపథ్యంలో ట్రాఫిక్ సమస్యల పరిష్కారం, ప్రజా రవాణా వ్యవస్థలో సమూల మార్పులు తీసుకురావడం…
… నగరపాలక సంస్థ పరిధిలోని ఫుట్ పాత్ ఆక్రమణల తొలగింపు, నియంత్రిత వెడ్డింగ్ జోన్ల ఏర్పాటు..
.. రోడ్డు పక్కన చిరు వ్యాపారులకు ప్రత్యామ్నాయంగా ప్రత్యేక ఈట్ స్ట్రీట్ జోన్లను ఏర్పాటు చేయడం…
… తిరుపతి ఆధ్యాత్మిక నగరంలో ‘ఫ్లెక్సీల ఫ్రీ తిరుపతి’ అమలు ద్వారా నగర శుభ్రత క్రమశిక్షణ పెంపు…
.. ఈ- షటిల్ ( ఎలక్ట్రిక్ మొబిలిటీ ) ప్రాజెక్టు ఏర్పాటు చేసి ఆధునిక రవాణా వ్యవస్థ ఏర్పాటు చేయడం.
వంటి కార్యక్రమాల అమలుకు కార్యాచరణ రూపొందించడం, అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం వంటి అంశాలపై టిడిపి జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్, ముఖ్యమంత్రి కార్యాలయ కార్యదర్శి ప్రద్యుమ్నతో సుదీర్ఘంగా చర్చించడం జరిగింది. అందుకు వారు సానుకూలత వ్యక్తం చేస్తూ సంబంధిత అధికారులకు తగిన మార్గదర్శకాలు ఇవ్వాలని టిడిపి రాష్ట్ర మాజీ అధికార ప్రతినిధి డాక్టర్ కోడూరు బాలసుబ్రమణ్యం కు హామీ ఇచ్చారు.

RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!