ప్రజాశక్తి రిపోర్టర్ బాబు చిన్నాన్నకు ఎమ్మెల్యే ఆదిమూలం నివాళి
పిచ్చాటూరు, మే 24 గరుడధాత్రి :
ప్రెస్ క్లబ్ ఆఫ్ పిచ్చాటూరు కార్యదర్శి, ప్రజాశక్తి రిపోర్టర్ బాబు వారి పినతండ్రి (చిన్నాన్న) అయిన కీలపూడి గ్రామానికి చెందిన నాగరాజ్ (60) ఈరోజు ఉదయం గుండెపోటుతో మృతి చెందారు. ఆయన పార్థివ దేహానికి సత్యవేడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం, మాజీ ఏఎంసీ చైర్మన్ ఇళంగోవన్ రెడ్డి తదితరులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నాగరాజ్ మృతి కుటుంబ సభ్యులకు తీరని లోటని పేర్కొన్నారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని దేవుని ప్రార్థిస్తూ, బాబు కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.
ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, పాత్రికేయులు, అభిమానులు, గ్రామస్తులు పాల్గొని నాగరాజ్‌కు తమ నివాళులు అర్పించారు.
