ePaper
Wednesday, August 5, 2026
📄 ePaper
Homeఆంధ్రప్రదేశ్తిరుపతిబత్తలవారి కండ్రిగ గంగమ్మ జాతరలో ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం

బత్తలవారి కండ్రిగ గంగమ్మ జాతరలో ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం

📰 Generate e-Paper Clip

పుత్తూరు మండల పరిధిలోని బత్తలవారి కండ్రిగ (సిటిఆర్ కండ్రిగ) గ్రామంలో జరుగుతున్న గంగమ్మ అమ్మవారి జాతర ఉత్సవాల్లో సత్యవేడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు.
గత రెండు రోజులుగా గ్రామంలో గంగమ్మ జాతర వైభవంగా జరుగుతుండగా, జాతర రెండో రోజు బుధవారం ఉదయం ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం అమ్మవారి ఆలయానికి చేరుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా జాతర నిర్వాహకులు ఎమ్మెల్యేకు ఘన స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు.
అమ్మవారికి టెంకాయ హారతులు, నైవేద్యాలు సమర్పించిన అనంతరం ఎమ్మెల్యే పేరిట ప్రత్యేక అర్చనలు నిర్వహించారు. అనంతరం జాతర కమిటీ సభ్యులు ఎమ్మెల్యేను దుశ్శాలువ, పూలమాలతో ఘనంగా సత్కరించి అమ్మవారి ప్రసాదాన్ని అందజేశారు.
ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, గ్రామ పెద్దలు, భక్తులు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. గంగమ్మ అమ్మవారి ఆశీస్సులతో ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉండాలని ఎమ్మెల్యే ఆకాంక్షించారు.

RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!