-ఒక కారు, మోటారు సైకిల్ సీజ్
-ఇద్దరు స్మగ్లర్లు అరెస్టు
తిరుపతి జిల్లా తాయి మమాంబపురం వద్ద 77 ఎర్రచందనం దుంగలతో పాటు, ఒక కారు, మోటారు సైకిల్ ను టాస్క్ ఫోర్స్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇద్దరు స్మగ్లర్లు ను అరెస్టు చేశారు. టాస్క్ ఫోర్స్ హెడ్ శ్రీ ఎల్. సుబ్బారాయుడు గారి కార్యాచరణ మేరకు టాస్క్ ఫోర్స్ ఎస్పీ శ్రీ పీ. శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో ఏఎస్పీ జె. కులశేఖర్ పర్యవేక్షణలో డీఎస్పీ శ్రీ ఎండీ షరీఫ్ మార్గ నిర్దేశకత్వంలో ఆర్ఎస్ఐ కె ఎస్ కె లింగాధర్ టీమ్, ఎఫ్ ఆర్ ఓ సుభాష్ తో కలసి తిరుపతి డివిజన్ పుత్తూరు రేంజ్ నారాయణ వనం బీటుకు మంగళవారం రాత్రి చేరుకున్నారు. పుత్తూరు-నేసనూరు మార్గం లోని తాయి మమాంబపురం వద్ద వాహనాలు తనిఖీ చేయసాగారు. బుధవారం తెల్లవారుజామున ఒక మోటారు సైకిల్, దాని వెనుక ఒక కారు వేగంగా రావడంతో అనుమానం వచ్చిన టాస్క్ ఫోర్స్ పోలీసులు ఆ వాహనాలను అడ్డగించే ప్రయత్నం చేశారు. అయితే ఆ వాహనాలు కొద్దీ దూరం లొనే ఆపి కొందరు వ్యక్తులు పారిపోసాగారు. అయితే టాస్క్ ఫోర్స్ సిబ్బంది వారిని వెంబడించి ఇద్దరిని పట్టు కున్నారు. వారిలో ఒకరిని పుత్తూరు మండలానికి చెందిన వ్యక్తి గాను, మరొకరిని తమిళనాడు తిరువన్నామలైకు చెందిన వారిగా గుర్తించి అరెస్టు చేశారు. కారులోని 77 ఎర్రచందనం దుంగలను, మోటారు సైకిల్, కారును స్వాధీనం చేసుకున్నారు. ముద్దాయులతో సహా వాహనాలు, దుంగలను టాస్క్ ఫోర్స్ పోలీసు స్టేషన్ కు తరలించారు. పట్టుబడిన వారిని డీఎస్పీ వీ.శ్రీనివాసులు రెడ్డి, ఏసీఎఫ్ జె. శ్రీనివాస్ విచారించారు. ఈ కేసును సీఐ ఖాదర్ బాషా నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
