ePaper
Wednesday, June 17, 2026
📄 ePaper
Homeఆంధ్రప్రదేశ్తిరుపతిపిచ్చాటూరులో జోరు వాన

పిచ్చాటూరులో జోరు వాన

📰 Generate e-Paper Clip

పిచ్చాటూరు, జూన్ 5 గరుడధాత్రి : పిచ్చాటూరు మండలంలో శుక్రవారం సాయంత్రం కురిసిన జోరు వర్షంతో ప్రజలు ఉపశమనం పొందారు. పలుచోట్ల రహదారులపై వర్షపు నీరు నిలిచిపోగా, వాతావరణం చల్లబడింది.

గత కొన్ని రోజులుగా ఎండలతో ఇబ్బందులు పడుతున్న ప్రజలకు ఈ వర్షం ఊరటనిచ్చింది. రైతులు కూడా వర్షాన్ని స్వాగతిస్తూ, వ్యవసాయ పనులకు ఇది ఉపయోగకరంగా ఉంటుందని అభిప్రాయపడ్డారు.
మండలంలోని పలు గ్రామాల్లో మోస్తరు నుంచి భారీ వర్షం కురవడంతో చెరువులు, కాలువల్లోకి నీరు చేరింది. మరికొంత సమయం వర్షం కొనసాగే అవకాశం ఉందని స్థానికులు తెలిపారు.

RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!