ePaper
Friday, June 19, 2026
📄 ePaper
Homeఆంధ్రప్రదేశ్తిరుపతియోగా, ధ్యానం వలన మానసిక ,శారీరక ఆరోగ్యం మెరుగుపడుతుంది -వైద్యాధికారి విజయ్ చందర్

యోగా, ధ్యానం వలన మానసిక ,శారీరక ఆరోగ్యం మెరుగుపడుతుంది -వైద్యాధికారి విజయ్ చందర్

📰 Generate e-Paper Clip

బైరెడ్డిపల్లి గరుడదాత్రి జూన్10

బైరెడ్డిపల్లి లో యోగాంధ్రకార్యక్రమం డాక్టర్ విజయ్ చందర్ ఆధ్వర్యంలో పి.హెచ్.సి.లో బుధవారం కొనసాగింది. ఈ సందర్భంగా ప్రాథమిక ఆరోగ్య కేంద్రం సిబ్బందితో యోగా చేయించి అవగాహన కల్పించారు. చిన్నప్పటినుండే యోగ, ధ్యానం అలవర్చుకోవాలని యోగా, ధ్యానం వలన మానసిక ,శారీరక ఆరోగ్యం పెంపొందడమే కాకుండా వత్తిడి తగ్గి ఉల్లాసంగా ఉంటారని ఆయన పేర్కొన్నారు.మంచి అలవాట్లు, ఆలోచనలకు దారి తీయునని, మంచి ఆలోచనలతో మంచి జీవితానికి పునాది అన్నారు. కాబట్టి తల్లిదండ్రులు పిల్లలకు యోగ అలవాటు చేయాలని తెలిపారు.ఈ కార్యక్రమంలో డిప్యూటీ హెల్త్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ సావిత్రి, సి.హెచ్.ఓ.,సూపర్ వైజర్స్,,ఎం.ఎల్.హెచ్.పి.ఎస్, ఆశలు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!