ఒక వైపు టెక్నాలజీ వైపు దూసుకుపోతున్నాం అని సంబరపడాలో.. లేక అదే టెక్నాలజీ మన పిల్లల ప్రాణాలను, బంధాలను బలి తీసుకుంటుందని ఏడవాలో అర్థం కావడం లేదు.
కర్ణాటకలోని కొప్పళ జిల్లా అయోధ్య క్యాంపులో జరిగిన ఒక ఘోరం వింటే మీ గుండె కూడా ఆగిపోతుంది.
అసలేం జరిగింది?
వెంకట మణిదీప్ అనే 16 ఏళ్ల అబ్బాయి.. మన చుట్టుపక్కల ఉండే చాలా మంది పిల్లల్లాగే ఆన్‌లై’న్ గేమ్స్‌కు పిచ్చిగా బా’నిసయ్యాడు. అర్ధరాత్రి దాటినా ఫోన్ వదలకుండా గేమ్స్ ఆడుతుంటే, అక్క ప్రగతి (18) తమ్ముడి మంచి కోరి మందలించింది. తల్లిదండ్రులు వెంకటనాయుడు (45), సౌజన్య కూడా జో’క్యం చేసుకుని, “రాత్రి పూట ఈ ఫోన్ ఏంటి?” అని కాస్త గట్టిగా చెప్పి ఫోన్ లా’క్కున్నారు.
కేవలం ఫోన్ లాక్కున్నారనే ఒకే ఒక్క కో’పం… ఆ పిల్లవాడిని కన్నవారిపైనే కాలయముడిగా మార్చేసింది!
తీవ్ర ఆగ్రహంతో ఊగిపోయిన ఆ బాలుడు, ఇంట్లో ఉన్న మచ్చుకత్తి తీసుకుని కన్నతల్లిదండ్రులపై, అక్కపై విచక్షణారహితంగా దాడి చేశాడు.
పక్క గదిలో ఉన్న తాతయ్య, నానమ్మ కాపాడటానికి బయటకు రాకుండా గది తలుపులకు గడియ పెట్టాడు. ఆ తర్వాత అదే కత్తితో తన గొతు కూడా కోసుకున్నాడు.
ఫలితం?
అక్క ప్రగతి, తండ్రి వెంకటనాయుడు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. తల్లి, ఆ దా*రుణానికి ఒడిగట్టిన బాలుడు ఇప్పుడు ఆస్పత్రిలో మృత్యువుతో పో*రాడుతున్నారు. ఒక నిమిషం ఆలోచించండి…ఆ ఇల్లు ఇప్పుడు నరకప్రాయంగా మారిపోయింది.
గేమిగ్ అడిక్షన్ ఒక జబ్బా?:
అవును, ఇది ఖచ్చితంగా ఒక మానసిక వ్యాధి. ఫోన్ లాక్కుంటే ప్రాణాలు తీసేంత కసి, కో’పం ఒక 16 ఏళ్ల పిల్లాడికి ఎక్కడి నుంచి వస్తున్నాయి?
స్క్రీన్ టైమ్ వర్సెస్ రిలేషన్స్:
ఈ రోజుల్లో పిల్లల చేతికి ఫోన్ ఇచ్చి మనం ప్రశాంతంగా ఉంటున్నామా? లేక వాళ్లలో ఒక సైకోను పెంచి పోషిస్తున్నామా?
దయచేసి ఇది గమనించండి:
తల్లిదండ్రులారా.. పిల్లలకు ఫోన్లు అలవాటు చేయకండి. ఒకవేళ వాళ్లు దానికి బా’నిసలయ్యారనిపిస్తే.. ఒక్కసారిగా ఫోన్ లాక్కోవడం వల్ల ఇలాంటి విపరీత పరిణామాలు ఎదురవుతున్నాయి. వాళ్లకు కౌన్సిలింగ్ ఇప్పించండి, ప్రేమగా మార్చడానికి ప్రయత్నించండి, అవసరమైతే డాక్టర్ల సహాయం తీసుకోండి.
ఈ డిజిటల్ యుగంలో మనం బంధాలను కోల్పోకూడదు. ప్లీజ్, మీ పిల్లల మొబైల్ అలవాట్లపై కన్నేసి ఉంచండి.
