ePaper
Saturday, August 1, 2026
📄 ePaper
Homeఆంధ్రప్రదేశ్తిరుపతిఅర్హులైన రైతులకు అవసరం మేరకు యూరియా, డి ఏ పి ని పంపిణీ చేస్తాం

అర్హులైన రైతులకు అవసరం మేరకు యూరియా, డి ఏ పి ని పంపిణీ చేస్తాం

📰 Generate e-Paper Clip

రైతులు తమ సర్వే నంబర్లలోని పంటల సాగు వివరాలు నమోదు తప్పనిసరి

-మండల వ్యవసాయశాఖ అధికారిణి గీత కుమారి

బైరెడ్డిపల్లి గరుడదాత్రి జూన్11

అర్హులైన రైతులకు అవసరం మేరకు యూరియా, డి ఏ పి ని వ్యవసాయ శాఖ పంపిణీ చేస్తాం. అనిమండల వ్యవసాయశాఖ అధికారిణి గీత కుమారి పేర్కొన్నారు.రైతులు తమ సర్వే నంబర్లలోని పంటల సాగు వివరాలుతప్పనిసరిగా నమోదు చేసుకోవాలని ఆమె తెలిపారు.ఈ ఖరఫ్ నుండి రైతు శిక్షణ కేంద్రం పరిధిలో కానీ ఎరువుల దుకాణాలలో కానీ యూరియా మరియు డిఏపి అమ్మకాలు ఏ.పి.ఏ.ఐ.ఎం.ఎస్. ద్వారా జరుగుతుంది. వెబలాండ్ మరియు ఈ క్రాఫ్ బుకింగ్ లోని వివరాలతో అనుసంధానిoచబడినది. ఈ వివరాలను రైతు శిక్షణ కేంద్రం సిబ్బంది తమ లాగిన్ లో సరిచేయడం జరుగుతోంది . ఆ వివరాల ప్రకారం రైతు తన సర్వే నంబర్స్ లో సాగు చేసిన పంట విస్తీర్ణం బట్టి యూరియా మరియు డి ఏ పి కేటాయించి దశల వారి పంపిణీ చేయబడుతుంది. కాబట్టి రైతులు తమ సర్వే నంబర్లలోని పంటల సాగు వివరాలు నమోదు చేసుకోవాలి . ఈ విధానం వలన ఎరువులు బ్లాక్ మార్కెట్ కి తరలింపు, వ్యవసాయతర వాడకాన్ని నివారించవచ్చు. తద్వారా అర్హులైన రైతులకు అవసరం మేరకు యూరియా, డి ఏ పి ని పంపిణీ చేయడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఈ కొత్త పద్దతిని రైతులు అర్థం చేసుకుని సహకరించవలసినదిగా ఆమె కోరారు..

RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!