తిరుమల :
తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. నిన్న శ్రీవారిని 92,830 మంది భక్తులు దర్శించుకోగా, 48,987 మంది తలనీలాలు సమర్పించారు. స్వామివారి హుండీ కానుకల ఆదాయం రూ.3.60 కోట్లుగా నమోదైంది. శ్రీవారి లడ్డూల విక్రయాలు 4.64 లక్షలు, అన్నప్రసాద వితరణ 3.37 లక్షలుగా సాగింది. అలాగే 4,069 మంది భక్తులు ఉచిత వైద్య సేవలు పొందారు. భక్తులతో కంపార్ట్మెంట్లు నిండిపోయి, ఆక్టోపస్ భవనం వెలుపల వరకు క్యూలైన్లు విస్తరించాయి. టోకెన్లు లేని భక్తులకు సర్వదర్శనానికి 24 నుండి 30 గంటల సమయం పడుతోంది.
