నాగలాపురం శ్రీ వేదనారాయణ స్వామి ఆలయంలో ఆదివారం వేదనారాయణ స్వామి ధర్మ రక్షణ సమితి ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. స్వామివారి దర్శనానికి విచ్చేసిన భక్తులకు ప్రేమతో అన్నప్రసాదాన్ని వడ్డించారు. ఈ కార్యక్రమంలో ధర్మ రక్షణ సమితి సభ్యులు, ఆలయ సేవకులు పాల్గొని భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు చేశారు. అన్నదాన కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామివారి ఆశీస్సులు పొందారు.
