ePaper
Wednesday, July 29, 2026
📄 ePaper
Homeఆంధ్రప్రదేశ్తెలుగు రాష్ట్రాల్లో రాబోయే 5 రోజులు భారీ వర్షాలు.....

తెలుగు రాష్ట్రాల్లో రాబోయే 5 రోజులు భారీ వర్షాలు…..

📰 Generate e-Paper Clip

గరుడధాత్రి న్యూస్ :
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో ఏపీ, తెలంగాణలో రాబోయే ఐదు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది.

పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, పిడుగులతో పాటు గంటకు 40–50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశముందని తెలిపింది.

ఏపీలో ఉత్తరాంధ్రతో పాటు గోదావరి, కృష్ణా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు, రాయలసీమలోని కొన్ని జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే సూచనలు ఉన్నాయంది.

అలాగే తెలంగాణలో కూడా మూడు నుంచి ఐదు రోజుల పాటు పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందంది.

RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!