ePaper
Sunday, September 13, 2026
📄 ePaper
Homeఆంధ్రప్రదేశ్తిరుపతికడప జిల్లా ఆర్యవైశ్య సంఘం రూరల్ కార్యవర్గ ప్రమాణ స్వీకారం త్వరలో - జిల్లా అధ్యక్షుడు...

కడప జిల్లా ఆర్యవైశ్య సంఘం రూరల్ కార్యవర్గ ప్రమాణ స్వీకారం త్వరలో – జిల్లా అధ్యక్షుడు వల్లంకొండు వెంకటరమణ

📰 Generate e-Paper Clip

బద్వేల్/మైదుకూరు జూలై 19 (గరుడధాద్రి న్యూస్):
కడప జిల్లా ఆర్యవైశ్య సంఘం రూరల్ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారోత్సవాన్ని త్వరలో ఘనంగా నిర్వహించనున్నట్లు జిల్లా ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడు వల్లంకొండు వెంకటరమణ తెలిపారు.
ఆదివారం బద్వేల్ పట్టణంలోని ఎన్జీవో హోం కార్యాలయంలో జిల్లా సంఘం తొలి సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమ ఏర్పాట్లపై జిల్లా నలుమూలల నుంచి వచ్చిన కార్యవర్గ సభ్యులతో విస్తృతంగా చర్చించారు.
అనంతరం జిల్లా కార్యవర్గంలోని వివిధ హోదాలకు నియమితులైన సభ్యులకు నియామక పత్రాలను అందజేశారు. కార్యక్రమం అనంతరం సభ్యులకు విందు ఏర్పాటు చేశారు.
ఈ సమావేశంలో జిల్లా ఆర్యవైశ్య సంఘం గౌరవ అధ్యక్షుడు కేవీ సుబ్బారావు, రూరల్ సెక్రటరీ సీవీ నాగేశ్వరరావు, కోశాధికారి పద్ధతి చంద్రశేఖర్, జిల్లా వర్కింగ్ కమిటీ అధ్యక్షుడు గురు ప్రసాద్, వాసవి సేవాదళ్ రాష్ట్ర కార్యదర్శి కారంపూడి రెడ్డి భార్గవ్, జిల్లా ఆర్యవైశ్య యువజన సంఘం అధ్యక్షుడు సన్నుతి హేమంత్, వాసవి సేవాదళ్ జిల్లా అధ్యక్షుడు హరి గోపాల్, పులివెందుల ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడు దేశు శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!