ePaper
Wednesday, July 29, 2026
📄 ePaper
Homeఆంధ్రప్రదేశ్తిరుపతిస్థానిక ఎన్నికల్లో పోటీకి సిద్ధమవుదాం

స్థానిక ఎన్నికల్లో పోటీకి సిద్ధమవుదాం

📰 Generate e-Paper Clip

శాంతిపురం బిజెపి అధ్యక్షులు గజేంద్ర
కుప్పం,జులై 23 (గరుడ ధాత్రి న్యూస్): రానున్న స్థానిక ఎన్నికల్లో పోటీకి సిద్ధమవుదామని శాంతిపురం మండల భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు గజేంద్ర విజ్ఞప్తి చేశారు. గురువారం శాంతిపురం మండలం కేంద్రంలో మండల స్థాయి భారతీయ జనతా పార్టీ సమావేశం జరిగింది. సమావేశంలో స్థానిక ఎన్నికలలో పోటీ చేయుటకు చర్చ జరిగింది. గ్రామీణ స్థాయి నుంచి బిజెపిని బలోపేతానికి కృషి చేయుటకు నిర్ణయించడం జరిగింది.అదేవిధంగా ప్రస్తుతం ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా ఢిల్లీలో జరుగుతున్నటువంటి అరాచక కార్యకలాపాలను ఖండించడం జరిగింది. దేశ విచ్చిన్న శక్తులను దేశానికి వ్యతిరేకంగా పనిచేస్తున్నటువంటి శక్తులను ఉపేక్షించేది లేదని దేశం బిజెపి పార్టీ మరియు నరేంద్ర మోడీ నాయకత్వంలో సురక్షితంగా ఉందని సమావేశంలో ప్రభుత్వానికి ఎప్పుడు అండగా ఉంటామని తీర్మానించడం జరిగింది. ఈ సమావేశం మండల అధ్యక్షుడు గజేంద్ర ఆధ్వర్యంలో జరిగింది.కుప్పం నియోజకవర్గం ఇంచార్జ్ తులసినాథ్ , స్టేట్ కౌన్సిల్ మెంబర్ కాశీనాథ్, ఉపాధ్యక్షుడు కుమార్, ఎస్సీ మోర్చా అధ్యక్షుడు వెంకటేష్, మురుగేష్, ఆచారి శంకరప్ప, మురుగేష్ మరియు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!