గరుడధాత్రి న్యూస్ :
నాగలాపురం: ఆడి నెల తొలి ఆదివారం సందర్భంగా నాగలాపురం శ్రీ ధర్మరాజుల ఆలయంలో ద్రౌపది అమ్మవారికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు, అలంకరణలు అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా భక్తులు అధిక సంఖ్యలో ఆలయానికి తరలివచ్చి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజల్లో పాల్గొని తమ మొక్కులు చెల్లించుకున్నారు.
ఈ కార్యక్రమంలో *నాగలాపురం తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు టీజేబీ ప్రణీత్ రెడ్డి*, *నాగలాపురం క్లస్టర్ ఇన్‌చార్జ్ శ్రీనివాస్ యాదవ్*, *ఐటీడీపీ అధ్యక్షుడు నరేంద్ర రెడ్డి*, *ఎస్సీ సెల్ నాయకుడు నాగరాజ్*, *పాఠశాల చైర్మన్ సుబ్రహ్మణ్యం* తదితరులు అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.
