గరుడ దాత్రి న్యూస్ పులివెందుల జులై 20:
జె.ఎన్.టి.యు ఇంజనీరింగ్ కాలేజ్ లో అవగాహన కార్యక్రమం నిర్వహించిన పులివెందుల అర్బన్ సి.ఐ శ్రీరామ్
మహిళల భద్రతను అత్యంత ప్రాముఖ్యతగా పరిగణించిన జిల్లా ఎస్పీ శ్రీ షెల్కే నచికేత్ విశ్వనాథ్, IPS గారి ఆదేశాలు, పులివెందుల డి.ఎస్.పి శ్రీ బి. మురళి గారి పర్యవేక్షణ లో పులివెందుల అర్బన్ పరిధిలోని జె.ఎన్.టి.యు ఇంజనీరింగ్ కాలేజ్ లో సోమవారం మహిళా రక్షణ, శక్తి యాప్, సైబర్ భద్రత, అత్యవసర సేవలు వంటి కీలక అంశాలపై విస్తృత అవగాహన కార్యక్రమం నిర్వహించారు.
ఈ సందర్బంగా పులివెందుల సి.ఐ శ్రీరామ్ మాట్లాడుతూ “మహిళలు సంక్షోభంలో చిక్కుకునే ప్రతి సారి పోలీస్ శాఖ వారి పక్కనే నిలబడే శక్తివంతమైన రక్షణ వ్యవస్థగా ‘శక్తి యాప్’ మరియు 112 అత్యవసర సేవలు పనిచేస్తున్నాయి.” అని స్పష్టం చేశారు.
SOS నొక్కిన క్షణంలోనే నియంత్రణ గదికి అలర్ట్ చేరి, 10 నిమిషాల్లో పోలీసులు అక్కడికి చేరేలా సదుపాయం అమలులో ఉందని తెలిపారు.
హెల్ప్‌లైన్‌లే మహిళల రక్షణ ఆయుధాలు
112, 1091, 181, 1930 వంటి కీలక హెల్ప్‌లైన్ నంబర్లు ప్రతి మహిళ చేతిలో ఉండాల్సిన రక్షణ ఆయుధాలు అని తెలిపారు.
ప్రమాదాలను ముందుగానే గుర్తించే పద్ధతులు, స్వీయ రక్షణ టెక్నిక్స్ గురించి వివరించారు.
సైబర్ భద్రత -అప్రమత్తతే రక్షణ
మహిళలను లక్ష్యంగా చేసుకుని పెరిగిపోతున్న సైబర్ మోసాలు, ఫేక్ లింకులు, UPI/OTP ఫ్రాడ్స్, సోషల్ మీడియా వేధింపులు గురించి పులివెందుల సి.ఐ శ్రీరామ్ తెలిపారు.
“డిజిటల్ ప్రపంచంలో ప్రతి క్లిక్ ముందు ఆలోచన — అప్రమత్తతే మీ రక్షణ” అని విద్యార్థినులకు స్పష్టం చేశారు. ‘శక్తి’ యాప్ — మీ చేతిలోనే పోలీస్ రక్షణ. అధికారులంతా విద్యార్థినులకు శక్తివంతమైన సందేశం ఇచ్చారు.
“శక్తి “ యాప్ మీ చేతిలోని మొబైల్ లో ఉంటే… పోలీస్ రక్షణ మీ వెంటే !” అని
పులివెందుల సి.ఐ శ్రీరామ్ పేర్కొన్నారు.
కార్యక్రమంలో పులివెందుల పోలీస్ స్టేషన్ ఎస్.ఐ లు మధుసూదన్ రెడ్డి, తిమోతి, కాలేజ్ అధ్యాపకులు, పెద్ద సంఖ్యలో జె.ఎన్.టి.యు విద్యార్ధినులు పాల్గొన్నారు.
