ePaper
Tuesday, September 15, 2026
📄 ePaper
Homeఆంధ్రప్రదేశ్తిరుపతిషైనింగ్ స్టార్స్ అవార్డులు సాధించిన మదర్ థెరిసా కళాశాల విద్యార్థులు

షైనింగ్ స్టార్స్ అవార్డులు సాధించిన మదర్ థెరిసా కళాశాల విద్యార్థులు

📰 Generate e-Paper Clip

!

పలమనేరు, జులై 20 ( గరుడ ధాత్రి ) :

రాష్ట్ర స్థాయిలో ఉత్తమ ర్యాంకులు సాధించిన జూనియర్ కళాశాల విద్యార్థులకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా అందించే ‘షైనింగ్ స్టార్స్ అవార్డుల’ ప్రదానోత్సవంలో మదర్ థెరిసా జూనియర్ కళాశాల విద్యార్థులు ఘన విజయం సాధించారు. జిల్లా కేంద్రమైన చిత్తూరులో విద్యాశాఖ, సమగ్ర శిక్ష ఆధ్వర్యంలో సోమవారం నిర్వహించిన కార్యక్రమంలో మదర్ థెరిసా జూనియర్ కళాశాలకు చెందిన ఏడుగురు విద్యార్థులు ఈ అవార్డులను కైవసం చేసుకున్నారు. 2025 – 26 జరిగిన పరీక్షల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులు అర్షియా, పావని శ్రీ, కీర్తన, సైయాద్ నిమ్రా, చరణ్ తేజ్, హుస్సేన్, గురు చరణ్ లు షైనింగ్ స్టార్ అవార్డులను జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్, చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్, పూతలపట్టు ఎమ్మెల్యే మురళీ మోహన్ చేతుల మీదుగా అందుకున్నారు. విద్యార్థులకు అవార్డుతో పాటు ప్రశంసా పత్రం రూ 20వేలు చొప్పున నగదు మూమెంటో తీసుకున్నట్టు కళాశాల కరెస్పాండంట్ రవీంద్ర బాబు తెలిపారు. రాష్ట్ర స్థాయిలో కళాశాలకు, ప్రాంతానికి మంచి పేరు తెచ్చిన విద్యార్థులను మదర్ థెరిసా కళాశాల కరెస్పాండెంట్ రవీంద్ర బాబు, చైర్మన్ సునీల్, డైరెక్టర్ రాజేంద్ర రెడ్డి, ప్రిన్సిపాల్ దివాకర్ రెడ్డి, వైస్ ప్రిన్సిపాల్ జైపాల్ రెడ్డి మరియు అధ్యాపక బృందం ప్రత్యేకంగా అభినందించారు.

RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!